Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 47 languages
«అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "రమదాన్ (మాసం) వచ్చినప్పుడు, స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి మరియు షైతానులు సంకెళ్లలో బంధించబడతారు."»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

రమదాన్ నెల ప్రారంభమైనప్పుడు, మూడు విషయాలు జరుగుతాయని ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం తెలిపినారు: మొదటిది: స్వర్గద్వారాలు తెరవబడతాయి మరియు వాటిలో ఏదీ మూసివేయబడదు. రెండవది: నరకద్వారాలు మూసివేయబడతాయి మరియు వాటిలో ఏదీ తెరవబడదు. మూడవది: షైతానులు మరియు దుష్ట జిన్నులు సంకెళ్లతో కట్టివేయబడతారు. అందువలన, రమదాన్ కాకుండా ఇతర నెలలలో వారు సాధించగలిగిన సాఫల్యాలు, ఈ నెలలో సాధించలేరు (అంటే ప్రజలను మార్గభ్రష్టత్వం వైపు ప్రేరేపించలేరు). ఇవన్నీ ఈ పవిత్రమైన నెల గొప్పదనాన్ని కీర్తించడానికీ, అలాగే నమాజ్, సదకా, జిక్ర్, ఖుర్ఆన్ పారాయణం మొదలైన పుణ్యకార్యాలు ఎక్కువగా చేసేలా, పాపాలు మరియు అవిధేయతలు నుండి దూరంగా ఉండేలా విశ్వాసులను ప్రోత్సహించడానికీను.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality