Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 48 languages
«అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "పరమ పరిశుద్ధుడు మరియు మహిమాన్వితుడైన అల్లాహ్ ప్రకటన: 'నేను నా నీతిమంతులైన దాసుల కొరకు అంతకు ముందెన్నడూ ఎవరి కళ్లూ చూడని, ఎవరి చెవులూ వినని, ఎవరి హృదయాలూ ఊహించని వాటిని సిద్ధం చేసి ఉంచాను.' అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) అన్నారు: 'మీరు కోరితే ఈ ఆయతును పఠించండి: {ఏ ప్రాణికీ తన కొరకు దాచిపెట్టబడిన కంటి చల్లదనం (సుఖసంతోషాలు) ఏమిటో తెలియదు.} (సూరత్ అస్సజ్దా: 17)'"»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: "నీతిమంతులైన నా బానిసల కోసం నేను స్వర్గంలో ఎటువంటి గొప్ప గౌరవాన్ని, సన్మానాన్ని సిద్ధం చేశానంటే, దాని స్వరూపాన్ని ఎవరి కళ్ళూ చూడలేదు, ఎవరి చెవులూ వినలేదు, ఎవరి హృదయాలూ ఊహించలేదు." అబూ హురైరా (రదియల్లాహు అన్హు) ఇలా పలికినారు: "మీరు కోరితే ఈ ఆయత్ని పఠించండి": {فَلَا تَعْلَمُ نَفْسٌ مَّآ أُخْفِىَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍۢ} "ఏ ప్రాణికీ తన కోసం దాచిపెట్టబడిన కంటి చల్లదనం (సుఖసంతోషాలు) ఏమిటో తెలియదు." [అస్సజదహ్:17]

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality