Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 62 languages
«అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఏడు ఎముకలపై (ఏడు ఎముకలు భూమికి ఆనేలా) సజ్దాహ్ చేయమని నేను ఆదేశించబడ్డాను. “నుదురు (అలా అని ఆయన చేతితో తన ముక్కు వైపునకు సంజ్ఞ చేసినారు), రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, మరియు రెండు కాళ్ళ చివరలు (అంటే రెండు కాలివేళ్ళు); మరియు బట్టలను గానీ జుట్టును గానీ పైకి దోపుకోరాదని కూడా ఆదేశించబడినది.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సలాహ్ ఆచరించునపుడు ఏడు శరీర భాగాలపై సజ్దాహ్ చేయమని అల్లాహ్ ఆదేశించినాడని వివరించారు. మొదటిది: నుదురు: ఇది ముఖములో భాగము; ఇది ముక్కు మరియు కనుల పైభాగము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతితో ముక్కును సూచించినారు; నుదురు మరియు ముక్కు రెండూ కలిపి ఏడు శరీర భాగాలలో ఒకటి అని సూచిస్తూ. దానిద్వారా సజ్దాహ్ చేయు వ్యక్తి ముక్కును కూడా నేలను ఆనించాలని ప్రత్యేకంగా సూచించినారు అన్నమాట. రెండవ మరియు మూడవ శరీర భాగములు – రెండు చేతులు. నాలుగవ మరియు ఐదవ శరీరభాగములు: రెండు మోకాళ్ళు. ఆరవ మరియు ఏడవ శరీర భాగములు: రెండు కాళ్ళ వేళ్ళు. ఇంకా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం – సజ్దాహ్ చేయునపుడు ధరించిన దుస్తులను గానీ, లేక తల వెంట్రుకలను గానీ పైకి దోపుకోరాదని ఆదేశించినారు. వాటిని నేలపై పరుచునేలా వదిలివేసి సజ్దాహ్ చేయాలని సూచించినారు.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality