Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అల్ ముగీరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :

Available in 61 languages
«అల్ ముగీరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక ప్రయాణములో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాను. (వారు వుదూ చేస్తూ కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చేసరికి) నేను, వారు కాళ్ళకు తొడుగుకుని ఉన్న, పలుచని తోలుతో చేసిన మేజోళ్ళను (ఖుఫ్ఫైన్ లను) తొలిగించడానికి ముందుకు వంగాను. అపుడు ఆయన ఇలా అన్నారు “వాటిని అలాగే ఉండనివ్వు (ఓ ముఘీరహ్), నేను వాటిని (పూర్తిగా) వుదూ చేసుకున్న తరువాత కాళ్ళకు తొడిగినాను”. అలా అని వారు తోలుతో చేసిన ఆ మేజోళ్ళపై తడి చేతులతో తడిమినారు (మసహ్ చేసినారు).»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రయాణంలో ఉన్నారు. అపుడు వారు వుజూ చేసినారు. వుజూలో కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చేసరికి, వారు పాదాలకు తొడుగుకుని ఉన్న “ఖుఫ్ఫైన్” లను (పలుచని తోలుతో చేసిన మేజోళ్ళను) తొలగించి, వారి పాదాలాను కడగడానికి, ముగీరహ్ రజియల్లాహు అన్హు వంగి తన చేతులను ముందుకు చాచినారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వాటిని అలాగే ఉండనివ్వు, వాటిని తొలిగించకు. ఎందుకంటే నేను వాటిని పూర్తిగా వుదూ ఆచరించి కాళ్ళకు తొడిగినాను”. అలా అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ ఖుఫ్ఫైన్’లపై తడి చేతులతో తడిమినారు (మసహ్ చేసినారు).

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality