Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 47 languages
«అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఒక ముస్లిం - లేదా విశ్వాసి - వుదూ చేసినప్పుడు — అతడు తన ముఖాన్ని కడిగినప్పుడు, అతడు తన కళ్లతో చూసిన ప్రతి పాపం, ఆ నీటితో లేదా చివరి నీటి బొట్టుతో ముఖం నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన చేతులను కడిగినప్పుడు, చేతులతో చేసిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో చేతుల నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన కాళ్ళను కడిగినప్పుడు, కాళ్లతో వెళ్లిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో కాళ్ళ నుండి బయటకు వచ్చేస్తుంది — అలా, చివరికి అతడు తన పాపాల నుండి పూర్తిగా శుభ్రంగా బయటకు వచ్చేస్తాడు."»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా తెలిపినారు: ఒక ముస్లిం లేదా విశ్వాసి వుదూ చేసేటప్పుడు — అతడు తన ముఖాన్ని కడిగినప్పుడు, తన కళ్లతో చూసిన ప్రతి చిన్న పాపం నీటితో లేదా చివరి నీటి బొట్టుతో ముఖం నుండి బయటకు వచ్చేస్తుంది; అలాగే తన చేతులను కడిగినప్పుడు, చేతులతో చేసిన ప్రతి చిన్న పాపం నీటితో లేదా చివరి నీటి బొట్టుతో చేతుల నుండి బయటకు వచ్చేస్తుంది; అలాగే తన కాళ్ళను కడిగినప్పుడు, కాళ్ళతో వెళ్లిన ప్రతి చిన్న పాపం నీటితో లేదా చివరి నీటి బొట్టుతో కాళ్ళ నుండి బయటకు వచ్చేస్తుంది. ఇలా, ఉదూ పూర్తయ్యేసరికి అతను చిన్న చిన్న పాపాల నుండి పూర్తిగా శుభ్రంగా బయటకు వస్తాడు

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality