Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 60 languages
«అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు (ఇస్లాం యొక్క విశ్వాసపు మూలస్థంభాలన్నింటినీ) విశ్వసించనంత వరకు స్వర్గములో ప్రవేశింపలేరు. మరియు మీరు ఒకరినొకరు ప్రేమించనంత వరకు మీరు విశ్వసించలేరు (విశ్వాసులు కాలేరు). మీకొక విషయం చెప్పనా – ఒకవేళ మీరు ఇలా చేస్తే మీరు ఒకరినొకరు ప్రేమిస్తారు అంటే సలాం చేయడాన్ని మీ మధ్య బాగా వ్యాప్తి చేయండి.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక విషయాన్ని స్పష్ట పరిచినారు – అది విశ్వాసులు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. అయితే వారు ఒకరినొకరు ప్రేమించనంత వరకు విశ్వాసము సంపూర్ణము కాదు, మరియు ముస్లిం సమాజము యొక్క స్థితి కూడా వృధ్ధి చెందదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ముస్లిం సమాజములో ప్రేమ ప్రవర్థిల్లు ఆచరణల వైపునకు మనలకు మార్గదర్శకం చేసినారు – అది ఏమిటంటే, అల్లాహ్ తన దాసులు ఒకరినొకరు అభివందనం చేయుట కొరకు సూచించిన “సలాము”, దానిని వ్యాపింపజేయమని తెలిపినారు.

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality