Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

సులైమాన్ ఇబ్న్ సురద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన:

Available in 53 languages
«సులైమాన్ ఇబ్న్ సురద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఇద్దరు వ్యక్తులు తగవులాడుకుంటున్నారు, ఒకరినొకరు అవమానకరంగా దూషించుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ముఖం కోపంతో ఎర్రబారింది, అతని మెడనరాలు ఉబ్బిపోయాయి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నాకు ఒక మాట తెలుసు, ఒకవేళ అతడు దానిని పలికినట్లయితే, అది అతణ్ణి ప్రశాంతపరుస్తుంది, అతడు “అఊదుబిల్లాహి మినష్’షైతాన్” (నేను షైతాను నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను) అని పలికినట్లయితే అతడు ఉన్న స్థితి (కోప స్థితి) తొలిగి పోతుంది”. అక్కడ ఉన్నవారు అతనితో (కోపంతో ముఖము ఎర్రబారిన వ్యక్తితో) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షైతాను నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుకోమన్నారు” అని తెలియజేసారు. దానికి అతడు “నేనేమైనా పిచ్చివాడినా?” అన్నాడు.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఇద్దరు వ్యక్తులు తగవులాడుకుంటున్నారు, వారిలో ఒకతని ముఖం కోపంతో ఎర్రబారి, అతడి మెడనరాలు ఉబ్బిపోయాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నాకు ఒక మాట తెలుసు. ఒకవేళ అతడు ఆ మాట పలికినట్లయితే అతడి కోపం దూరమై పోతుంది. అతడు ఇలా పలకాలి “అఊదు బిల్లాహి మినష్’షైతానిర్రజీం” (నేను శపించబడిన షైతాను బారి నుండి అల్లాహ్ రక్షణ కోరుతున్నాను)” అన్నారు. అక్కడ ఉన్న వారు అతనితో “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అఊదు బిల్లాహి మినష్’షైతానిర్రజీం” అని పలుకమని చెప్పినారు” అని తెలియజేసారు. దానికి అతడు “నేనేమైనా పిచ్చివాడినా?” అన్నాడు. మతిస్థిమితం కోల్పోయిన వాడు తప్ప షైతాను నుండి ఎవరూ రక్షణ కోరుకోరు అని అతడు భావించినాడు.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality