Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

Available in 60 languages
«అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.” సహీహ్ బుఖారీలో: “చిన్న వారు (వయసులో) పెద్దవారికి; పాదచారుడు కూర్చుని ఉన్న వానికి, చిన్న సమూహం పెద్ద సమూహానికి సలాం చేయాలి” అని నమోదు చేయబడి ఉన్నది.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో ‘సలాం’ ను విస్తరించే విధానానికి సంబంధించిన విధానాలను బోధిస్తున్నారు – అది “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు మీపై కురియుగాక). చిన్న వాళ్ళు (వయసులో) పెద్దవారికి సలాం చేయాలి; సవారీ అయి ఉన్న వ్యక్తి, కాలినడకన వెళుతున్న వానికి సలాం చేయాలి; కాలినడకన వెళుతున్న వ్యక్తి కూర్చుని ఉన్న వ్యక్తికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality