Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు:

Available in 70 languages
«అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “(ఒకసారి అల్లాహ్ వద్ద నుండి సందేశం తీసుకుని నా వద్దకు వచ్చినపుడు) జిబ్రయీల్ అలైహిస్సలాం పొరుగువాని హక్కులను గురించి నాకు ఎంతగా ఉపదేశించినారంటే, పొరుగు వానిని వారసుడిగా చేస్తారేమోనని నాకు సందేహం కలిగింది”.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి జిబ్రయీల్ అలైహిస్సలాం తన వద్దకు వచ్చినపుడు జరిగిన విషయాన్ని వివరిస్తున్నారు. అపుడు జిబ్రయీల్ అలైహిస్సలాం పొరుగువాని హక్కులను గురించి పలుమార్లు, మాటిమాటికి గట్టిగా నొక్కి చెప్పినారని, ఆదేశించినారని చెప్పారు. పొరుగువాడు అంటే మన ఇంటికి పొరుగునే ఉండే వాడు కావచ్చు లేక మన ఇంటికి సమీపంలో ఉండే వాడు కావచ్చు, అతడు ముస్లిం కావచ్చు, లేక అవిశ్వాసి కావచ్చు, మన బంధువు కావచ్చు లేక ఇంకెవరైనా కావచ్చు; అతడి హక్కులను పరిరక్షించుట, అతనికి హాని, కీడు, నష్టము తలపెట్టకుండా ఉండుట, అతని పట్ల సత్ప్రవర్తనతో వ్యవహరించుట, అతడు ఏమైనా హాని, నష్టము తలపెడితే దానిపై సహనం వహించుట మొదలైన వాటి గురించి జిబ్రయీల్ అలైహిస్సలాం పలుమార్లు ఎంతగా చెప్పినారంటే, పొరుగువాని హక్కుల పట్ల గౌరవం, మరియు జిబ్రీల్ అలైహిస్సలాం పలుమార్లు గట్టిగా చెప్పడం చూసి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తాను చనిపోయిన తరువాత తన సంపదకు పొరుగువానిని వారసునిగా చేస్తూ వహీ అవతరిస్తుందేమో అని సందేహించారు.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality