Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

బనీ ముజాషీ తెగ సోదరుడైన ఇయాద్ ఇబ్న్ హిమార్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్యన ఒక ప్రసంగకర్తగా నిలబడి ఇలా అన్నారు:” ఇయాద్ ఇబ్న్ హిమార్ (రదియల్లాహు అన్హు) ఆ హదీథును వివరించినారు; అందులో ఇలా ఉన్నది:

Available in 40 languages
«బనీ ముజాషీ తెగ సోదరుడైన ఇయాద్ ఇబ్న్ హిమార్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ఒకరోజు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మా మధ్యన ఒక ప్రసంగకర్తగా నిలబడి ఇలా అన్నారు:” ఇయాద్ ఇబ్న్ హిమార్ (రదియల్లాహు అన్హు) ఆ హదీథును వివరించినారు; అందులో ఇలా ఉన్నది: “నిశ్చయంగా అల్లాహ్ నాకు ఈ విధంగా వహీ చేసినాడు (దివ్యజ్ఞానాన్ని అవతరింపజేసినాడు) – ఎవరూ ఒకరిపై మరొకరు గొప్పలు చెప్పుకోకండి, మరియు ఎవరూ ఒకరిని మరొకరు అణచివేతకు గురిచేయకండి.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులను సంబోధిస్తూ ప్రసంగించినారు – ఆ ప్రసంగములో మిగతా విషయాలతో పాటు వారు ఇలా అన్నారు: నిశ్చయంగా అల్లాహ్ తనపై ఈ విధంగా దివ్యఙ్ఞానాన్ని అవతరింపజేసినాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసినారు: ప్రజలు పరస్పరం వినయంతో మెలగాలి, ఇతరుల కొరకు తమ రెక్కలు వంచి, సౌమ్యంగా ఉండాలి. తద్వారా ఎవరూ తమ వంశపారంపర్యత, సంపద లేదా మరే విషయం ఆధారంగానైనా గొప్పతనం, గర్వం లేదా గౌరవం గురించి గొప్పలు చెప్పుకోరాదు; మరియు ఎవరూ ఎవరినీ అణచివేయరాదు లేదా అతిక్రమించరాదు.

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality