Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 64 languages
«అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మత్తు కలిగించే ప్రతి పదార్థమూ మద్యమే అనబడుతుంది, కనుక మత్తు కలిగించే ప్రతిదీ హరామే (నిషేధించబడినదే). ఎవరైతే ప్రాపంచిక జీవితంలో మద్యము త్రాగుతూ ఉంటాడో, పశ్చాత్తాపము చెందకుండా, దానికి అలవాటు పడి ఉన్న స్థితిలోనే మరణిస్తాడో, అతడు పరలోక జీవితములో దానిని (స్వర్గపానీయాలను) త్రాగలేడు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: మెదడును మత్తులో ముంచి, మబ్బులా కమ్మివేసి, సరిగా పనిచేయకుండా చేసే ప్రతిదీ మద్యం అనబడుతుంది; అది తినడం ద్వారా కానీ, త్రాగడం ద్వారా కానీ, ముక్కుతో పీల్చడం ద్వారా కానీ, లేక ఇంకే విధంగానైనా కానీ. మెదడును మత్తులో ముంచి, మబ్బులా కమ్మివేసి, సరిగా పనిచేయకుండా చేసే ప్రతిదీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ద్వారా హరాం చేయబడింది (నిషేధించబడినది); అది కొద్ది మొత్తములోనైనా, లేక ఎక్కువ మోతాదులోనైనా సరే. మరియు ఎవరైనా ఏ రకమైన మత్తుపదార్థాలు వాడినా, వాటిని తాగడం కొనసాగించి, చనిపోయే వరకు వాటి నుండి పశ్చాత్తాపపడకపోతే, అటువంటి వారు అల్లాహ్ శిక్షకు అర్హులు అవుతారు, స్వర్గంలో ఇవ్వబడే పానీయాలను తాగకుండా చేస్తాడు.

Source
ముస్లిం, అల్ బుఖారీ చివరి వాక్యం పదాలతో నమోదు చేసినారు:
Download image

Saved at original quality