Hadith for the World
Topic

హదీసు మరియు దాని శాస్త్రాలు

3 hadiths

3 hadiths

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నా నుండి ఇతరులకు చేరవేయండి, అది ఒక్క వాక్యమైనా సరే. ఇస్రాయీలు సంతతి వారి నుండి కూడా ఉల్లేఖించండి, అందులో అభ్యంతరము ఏమీ లేదు. (అయితే తెలుసుకోండి) ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నాకు అబద్దాలను అంటగడతాడో, అతడు తన స్థానాన్ని నరకాగ్నిలో స్థిర పరుచుకున్నట్లే".అల్ బుఖారీ నమోదు చేసినారు:
సమురా ఇబ్న్ జుందుబ్ మరియు ముగీరహ్ ఇబ్న్ షు’బహ్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా పేరున ఎవడైనా అసత్యమైనదిగా కనిపించే (అంటే ప్రవక్త (స) పలుకని) హదీథును ప్రస్తావించినట్లైతే అతడు ఇద్దరు అబధ్ధాలకోరులలో ఒకడు అవుతాడు.”ముస్లిం తన ముఖద్దిమాలో నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఉద్దేశ్యపూర్వకంగా నా గురించి అసత్యాలు పలుకుతాడో, అతడు తన నివాస స్థానాన్ని నరకాగ్నిలో ఏర్పాటు చేసుకోవాలి.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు