Hadith for the World
సద్గుణాలు మరియు పద్దతులు

మనస్సును మృధువుగా చేసే మాటలు మరియు హితబోధనలు

63 hadiths

63 hadiths

అబూ బక్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పెద్ద పాపములలోకెల్లా అతి పెద్ద పాపములు ఏమిటో మీకు తెలుపనా?” అలా మూడు సార్లు పలికారు. దానికి మేము “తప్పనిసరిగా చెప్పండి ఓ రసూలుల్లాహ్” అని అన్నాము. అపుడు ఆయన “అల్లాహ్ కు సాటి కల్పించుట, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట మరియు వారితో అమర్యాదగా ప్రవర్తించుట” అలా పలికి, అప్పటివరకు చేరగిలబడి కూర్చుని ఉన్న ఆయన నిటారుగా కూర్చుని “అబద్ధమాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట” అని అన్నారు. ఈ మాటలను ఆయన ఆగకుండా పలుమార్లు పలుకుతూనే ఉన్నారు. ఎంతగా అంటే “వారు (ఇకనైనా) మౌనంగా ఉంటే బాగుండును” అని మేము భావించ సాగినాము.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أنس بن مالك رضي الله عنه أنَّ رَجُلاً كَانَ عِند النَبِيَّ صلى الله عليه وسلم فَمَرَّ رَجُلٌ بِهِ، فقال: يا رسول الله، أنِّي لَأُحِبُّ هَذَا، فَقَال لَهُ النَبِيُّ صلى الله عليه وسلم : «أَأَعْلَمْتَهُ؟» قال: لا. قال: «أَعْلِمْهُ»، فَلَحِقَهُ، فقال: إِنِّي أُحِبُّك فِي الله، فقال: أّحَبَّك الَّذِي أَحْبَبْتَنِي لَهُ.رواه أبو داود والنسائي في الكبرى وأحمد
عن أبي موسى الأشعري رضي الله عنه قَالَ: قالَ رسول اللَّه -صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم-: «إِنَّ مِنْ إِجْلاَلِ الله -تَعَالَى-: إِكْرَامَ ذِي الشَّيْبَةِ المُسْلِمِ، وَحَامِلِ القُرْآنِ غَيرِ الغَالِي فِيه، وَالجَافِي عَنْه، وَإِكْرَام ذِي السُّلْطَان المُقْسِط».رواه أبو داود
అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “అల్-కబాయిర్ (ఘోరమైన పాపములు, పెద్ద పాపములు) ఏమిటంటే: అల్లాహ్ కు సాటి కల్పించుట (అల్లాహ్ కు సరిసమానులు చేయుట), తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట, హత్య చేయుట మరియు ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధపు సాక్ష్యము చెప్పుట.”అల్ బుఖారీ నమోదు చేసినారు:
అబీ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా ఈ ప్రపంచం మధురమైనది మరియు పచ్చనైనది (సుందరమైనది); మరియు నిశ్చయంగా అల్లాహ్ (మీ సమయములో) మిమ్ములను అందులో (ప్రపంచములో) వారసులుగా చేసినాడు – మీరు ఎలా వ్యవహరిస్తారో చూడడానికి. కనుక ఈ ప్రపంచం పట్ల జాగ్రత్తగా ఉండండి, మరియు స్త్రీలపట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇస్రాయీలు సంతతిలో అరాచకత్వం ప్రబలడానికి వారి స్త్రీ లాలసే మొదటి కారణం అయినది.”ముస్లిం నమోదు చేసినారు:
عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما مرفوعاً: «ليس منا من لم يَرحمْ صغيرنا، ويَعرفْ شَرَفَ كبيرنا».رواه أبو داود والترمذي وأحمد
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రళయ ఘడియను గురించి ప్రశ్నిస్తూ, ఇలా అన్నాడు: “ప్రళయ ఘడియ ఎపుడు సంభవిస్తుంది?” జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దాని కొరకు నీవు ఏమి తయారు చేసుకున్నావు?” అని ప్రశ్నించారు. దానికి అతడు “ఏమీ లేదు, కేవలం అల్లాహ్ పై, ఆయన సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం పై (హృదయం నిండా) ప్రేమ తప్ప” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, వారితో పాటే ఉంటావు” అన్నారు. అనస్ రదియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, అబూబకర్ మరియు ఉమర్‌లను ప్రేమిస్తున్నాను. మరియు నేను వారిలా సత్కార్యాలు ఆచరించలేక పోయినా, వారి పట్ల నాకున్న ప్రేమ కారణంగా (ప్రళయదినాన) నేను వారితో ఉండాలని ఆశిస్తున్నాను, .”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ మూసా అల్ అషఅరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక మంచి సహచరుని సాంగత్యము, మరియు ఒక చెడు సహచరుని సాంగత్యముల యొక్క ఉపమానం కస్తూరి సుగంధాన్ని అమ్మువానికి, మరియు లోహకారుని (కమ్మరివాని) కొలిమి తిత్తులను ఊదు వానిని పోలి ఉన్నది. కస్తూరి సుగంధాన్ని అమ్మువాడు: అతడు నీకు కొద్ది సుగంధాన్ని ఉచితంగా ఇస్తాడు, లేదా నీవు అతడి నుండి కొద్ది సుగంధాన్ని కొనుక్కుంటావు, లేదా (అతని సాంగత్యములో గడిపిన కారణంగా) నీవు సుగంధాన్ని ఆస్వాదిస్తావు. లోహకారుని కొలిమి తిత్తులను ఊదువాడు: (కొలిమి నుండి నిప్పు రవ్వలు ఎగరడం వల్ల) అతడు నీ వస్త్రాలను కాలుస్తాడు, లేదా నీవు అతడి నుండి అప్రియమైన వాసన చూస్తావు”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసులలో స్త్రీలు, పురుషులు ఎవరైనా – స్వయంగా వారి విషయంలోనూ, వారి సంతానం విషయంలోనూ, వారి సంపదల విషయంలోనూ పరీక్షించబడుతూనే ఉంటారు - చివరికి వారు తమ ఖాతాలో ఒక్క పాపము కూడా లేకుండా అల్లాహ్’ను కలుసుకునే వరకు.”అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
షుఐబ్ ఇబ్న్ సినాన్ అర్’రూమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక విశ్వాసి యొక్క వ్యవహారం ఎంత అద్భుతమైనది! నిశ్చయంగా అతని అన్ని వ్యవహారాలు అతని కొరకు శుభాల్నే కలిగి ఉంటాయి. ఇలా ఒక విశ్వాసికి తప్ప మరింకెవరికీ ఉండదు. ఒకవేళ అతనికి మంచి కలిగితే, అతడు (అల్లాహ్’కు కృతజ్ఞతలు తెలుపుకుని) కృతజ్ఞుడై ఉంటాడు, అది అతనికి శుభప్రదమైనది; ఒకవేళ అతనికి ఏదైనా ఆపద కలిగితే, అతడు దానిపై సహనం వహిస్తాడు, అది కూడా అతనికి శుభప్రదమైనదే.”ముస్లిం నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “వినాశకరమైన ఏడు పాపముల నుండి దూరంగా ఉండండి.” దానికి వారు (ఆయన సహచరులు) ఇలా అడిగారు “అవి ఏమిటి ఓ ప్రవక్తా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ కు సాటి కల్పించుట; చేతబడి; చట్టబధ్ధమైన కారణం ఉంటే తప్ప “ప్రాణము తీయరాదు” అని అల్లాహ్ నిషేధించిన ప్రాణము తీయుట; వడ్డీ తినుట; అనాథల సొమ్ము తినుట; యుధ్ధభూమి నుండి వెనుదిరిగి పారిపోవుట; శీలవంతులు, అమాయకులు మరియు విశ్వాసులైన స్త్రీలపై అపనిందలు వేయుట”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “పరమ శుభదాయకుడు, పరమోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా తెలిపినాడు ‘సాటి కల్పించబడే వారందరికన్నా నేను అత్యంత స్వయం సమృధ్ధుడను. సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినీ కలిగి ఉండవలసిన అవసరం లేని వాడను. కనుక ఎవరైనా ఏదైనా ఆచరణ ఆచరించి, అందులో ఇతరులతో నాకు సాటి కల్పించినట్లయితే , అతడిని,అతడు సాటి కల్పించిన వాటిని నేను వదిలి వేస్తాను’.ముస్లిం నమోదు చేసినారు:
ఉబాదహ్ ఇబ్న్ సామిత్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “”ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, వ అన్న ఈసా అబ్దుల్లాహి, వ రసూలుహు, వ కలిమతుహు, అల్’ఖాహా ఇలా మర్యమ, వ రూహుమ్మిన్’హు, వల్ జన్నతు హఖ్ఖున్, వన్నారు హఖ్ఖున్”, అని సాక్ష్యం పలుకుతాడో, అల్లాహ్ అతడిని స్వర్గం లో ప్రవేశింపజేస్తాడు, అతడి ఆచరణలు ఏమైనప్పటికీ.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن معاذ بن جبل رضي الله عنه عن رسول الله صلى الله عليه وسلم أنه قال: «قَالَ اللهُ -عَزَّ وجَلَّ-: المُتَحَابُّون فِي جَلاَلِي، لَهُم مَنَابِرُ مِن نُورٍ يَغْبِطُهُم النَبِيُّونَ والشُهَدَاء».رواه الترمذي وأحمد
అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీలో (ప్రతి) ఒకరికి స్వర్గము అతని కాలి చెప్పు యొక్క తోలుపట్ట కంటే దగ్గరగా ఉన్నది, అలాగే నరకము కూడా దాని మాదిరిగానే (అతనికి దగ్గరగా) ఉన్నది”.అల్ బుఖారీ నమోదు చేసినారు:
అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఈ ప్రపంచము విశ్వాసి కొరకు ఒక జైలు వంటిది; మరియు అవిశ్వాసి కొరకు ఒక స్వర్గము వంటిది.”ముస్లిం నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: «إنَّ في الجنَّة مائةَ دَرَجَة أعَدَّهَا الله للمُجاهِدين في سَبِيل الله ما بَيْنَ الدَّرَجَتَيْنِ كما بين السماء والأرض».رواه البخاري
عن سهل بن سعد الساعدي ـرضي الله عنه- قَالَ رَسُول اللَّه -صَلّى اللهُ عَلَيْهِ وسَلَّم-: «لو كانت الدنيا تَعدل عند الله جَناح بَعوضة، ما سَقَى كافراً منها شَرْبَة ماء».رواه الترمذي
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “నా ఉమ్మత్ మొత్తం (అల్లాహ్ చేత) క్షమించబడుతుంది; ఎవరైతే బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడతారో వారు తప్ప. బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడుటలో ఇది కూడా ఒక రకం – అందులో ఒకడు రాత్రివేళ పాపకార్యానికి ఒడిగడతాడు; ఉదయానికి అల్లాహ్ అతని పాపకార్యాన్ని (లోకులనుండి) కప్పివేస్తాడు; కానీ అతడు: “ఓ ఫలానా! ఓ ఫలానా! (నీకు తెలుసా) నేను రాత్రి ఇలా ఇలా చేసాను” అంటాడు (అలా అని దానిని బహిరంగ పరుస్తాడు). రాత్రి అతడు అల్లాహ్ యొక్క పరదా మాటున గడిపినప్పటికీ, ఉదయం అతడు తనంతట తానే ఆ పరదాను తొలగిస్తాడు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “మరణానికి మూడు దినముల ముందు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “మీలో ఎవ్వెరూ అల్లాహ్ పట్ల ఉత్తమమైన అంచనాలు కలిగి ఉన్న స్థితిలో తప్ప చనిపోకండి.”ముస్లిం నమోదు చేసినారు:
అబూ సయీద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఓ అబా సయీద్! ఎవరైతే అల్లాహ్‌ను తన ప్రభువుగా, ఇస్లాంను తన ధర్మంగా మరియు ముహమ్మద్‌ సల్లల్లాహు అలైహి వసల్లంను తన ప్రవక్తగా సంతృప్తి చెందుతారో, వారికి స్వర్గం హామీ ఇవ్వబడుతుంది." అబూ సయీద్ దానితో ఆశ్చర్యపోయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాడు: ఓ రసూలల్లాహ్! దానిని నా కొరకు పునరావృతం చేయండి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అలా పునరావృతం చేసి, ఇంకా ఇలా పలికినారు: "స్వర్గంలో దాసుడి స్థానాన్ని వంద స్థాయిలు పెంచే మరొక విషయం కూడా ఉంది; ప్రతి రెండు స్థాయిల మధ్య దూరం భూమ్యాకాశాల మధ్య దూరమంత ఉంటుంది." అపుడు అతను ఇలా అడిగినారు: "ఓ రసూలల్లాహ్! అది ఏమిటి?" దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "అల్లాహ్ కొరకు ధర్మపోరాటం, అల్లాహ్ కొరకు ధర్మపోరాటం."ముస్లిం నమోదు చేసినారు:
عن أنس رضي الله عنه مرفوعاً: «يَتْبَعُ الميتَ ثلاثةٌ: أهْلُه ومَالُه وعَمَلُه، فيرجع اثنان ويَبْقى واحد: يرجع أهْلُه ومَالُه، ويبقى عَمَلُه».متفق عليه
عن أنس بن مالك رضي الله عنه مرفوعاً: «يُؤتى بأنعم أهل الدنيا من أهل النار يوم القيامة، فَيُصْبَغُ في النار صَبْغَةً، ثم يقال: يا ابن آدم، هل رأيت خيرًا قطُّ؟ هل مَرَّ بك نَعِيمٌ قطُّ؟ فيقول: لا والله يا رب، وَيُؤْتَى بأشدِّ الناس بُؤسًا في الدنيا من أهل الجَنَّة، فَيُصْبَغُ صَبْغَةً في الجنَّة، فيقال له: يا ابن آدم، هل رأيت بُؤسًا قط؟ هل مَرَّ بك شِدَّةٌ قط؟ فيقول: لا والله، ما مَرَّ بي بُؤْسٌ قطٌّ، ولا رأيت شِدةً قَطُّ».رواه مسلم
అన్’నవ్వాస్ ఇబ్న్ సిమ్’ఆన్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ధర్మం మరియు పాపం గురించి అడిగాను, వారు ఇలా జవాబిచ్చారు: "ధర్మం యొక్క సారాంశం మంచి ప్రవర్తన (అఖ్లాక్) లో వ్యక్తమవుతుంది, అయితే పాపం అనేది నీ హృదయంలో నీకు అసౌకర్యాన్ని కలిగించేది, మరియు నీవు దానిని ఇతరులకు బహిర్గతం చేయడాన్ని అసహ్యించుకునేది”.ముస్లిం నమోదు చేసినారు: