Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అమ్ర్ బిన్ సులైమ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “అబూ సయీద్ ఇలా అన్నారని నేను సాక్ష్యమిస్తున్నాను: అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని నేను సాక్ష్యమిచ్చి చెబుతున్నాను: వారు ఇలా అన్నారు:

Available in 60 languages
«అమ్ర్ బిన్ సులైమ్ అల్ అన్సారీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “అబూ సయీద్ ఇలా అన్నారని నేను సాక్ష్యమిస్తున్నాను: అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని నేను సాక్ష్యమిచ్చి చెబుతున్నాను: వారు ఇలా అన్నారు: “యుక్తవయస్కుడైన ప్రతి ముస్లిం పురుషునిపై శుక్రవారం నాడు గుసుల్ చేయుట (తల స్నానం చేయుట) విధి; అలాగే మిస్వాక్ తో (పలుదోము పుల్లతో) పళ్ళు శుబ్రపరుచుకొనుట మరియు అందుబాటులో ఉన్నట్లయితే అత్తరు పూసుకొనుట కూడా.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - శుక్రవారము నాటి సలాహ్ ఆచరించుట ఎవరెవరిపై విధి అగునో, యుక్త వయస్కుడైన అటువంటి ప్రతి ముస్లిం శుక్రవారము నాడు గుసుల్ చేయాలి, అది అతనిపై విధి – అని స్పష్టపరిచినారు. అలాగే ‘మిస్వాక్’ పుల్లను, లేదా అటువంటి ఇంకా ఏదైనా పుల్లను (బ్రష్’ను) ఉపయోగించి పళ్ళు శుభ్రపరుచుకొనుట కూడా విధి. అలాగే అందుబాటులో ఉంటే ఏదైనా పరిమళ ద్రవ్యాన్ని (ఉదా: ఏదైనా అత్తరును) పూసుకొనుట కూడా విధి.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality