Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

సహ్ల్ ఇబ్నె సా’ద్ అస్’సాయిదీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:

Available in 42 languages
«సహ్ల్ ఇబ్నె సా’ద్ అస్’సాయిదీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “అల్లాహ్ మార్గంలో ఒక రోజు “రిబాత్” పాటించడం (అంటే, ముస్లింల సరిహద్దులను కాపాడటం) ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే శుభప్రదమైనది; , మరియు స్వర్గములో, మీలో ఎవరి వద్దనైనా ఉన్న చిన్న కొరడాతో ఆక్రమించ దగినంత చిన్న స్థలమైనా ఈ ప్రపంచం కంటే మరియు దాని ఉపరితలంపై ఉన్న దాని ప్రతిదాని కన్నా ఉత్తమమైనది; మరియు అల్లాహ్ యొక్క దాసుడు, ఒక ఉదయం లేదా ఒక సాయంత్రం అల్లాహ్ మార్గములో చేసే ప్రయాణం ఈ ప్రపంచం మరియు దాని ఉపరితలంపై ఉన్న ప్రతి దాని కంటే ఉత్తమమైనది.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ముస్లింలకు మరియు అవిశ్వాసులకు మధ్య ఉన్న ప్రదేశంలో అల్లాహ్ కొరకు నిజాయితీగా ఒక రోజు ముస్లింలను వారి నుండి కాపాడటం ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే ఉత్తమమైనది; అలాగే అల్లాహ్ మార్గంలో పోరాడటానికి ఉపయోగించే కొరడా, స్వర్గం లో ఎంత స్థలమైతే ఆక్రమించగలదో, అది ఈ ప్రపంచం మరియు దానిలో ఉన్న ప్రతిదానికంటే ఉత్తమమైనది; మరియు దినము ప్రారంభం నుండి మధ్యాహ్నం ముందు వరకు లేదా మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అల్లాహ్ మార్గంలో ఒక్కసారి నడిచినట్లైతే అందుకు లభించే ప్రతిఫలం మరియు బహుమానం ఈ ప్రపంచం మరియు దానిలోని ప్రతిదానికంటే ఉత్తమమైనది.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality