Hadith for the World
Tap the image to view it full size
జీవితచరిత్ర మరియు చరిత్ర

ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం :

Available in 56 languages
«ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుడి పార్శ్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు, పాదరక్షలు తొడుగుకొనుట, తలవెంట్రుకలు దువ్వుట, స్నానం చేయుట మొదలైన (ఉపయుక్తమైన) పనులన్నింటినీ కుడి వైపునుండి ప్రారంభించేవారు."»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, తనకు సంబంధించిన విషయాలలో, గౌరవప్రదమైన పనులన్నింటినీ కుడి వైపునుండి ప్రారంభించడానికి ఇష్టపడేవారు మరియు ప్రాధాన్యతనిచ్చేవారు, వాటిలో కొన్ని: కాలికి పాదరక్షలను తొడిగేటపుడు వారు ముందుగా కుడికాలుతో ప్రారంభించేవారు; ఆయన తన తల మరియు గడ్డం యొక్క వెంట్రుకలను దువ్వునపుడు, వాటిని సవరించి, ఒద్దికగా ఒక రూపునిచ్చునపుడు, మరియు నూనె రాయునపుడు కుడి వైపునుండి ప్రారంభించేవారు. అలాగే ఉదూలో కూడా చేతులను మరియు కాళ్ళను కడుగునపుడు ఎడమ పార్శముపై కుడి పార్శ్వానికి ప్రాధాన్యతనిచ్చేవారు.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality