Hadith for the World
దైవప్రవక్త పుట్టుక గుణాలు

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (మార్గం)

7 hadiths

7 hadiths

ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుడి పార్శ్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు, పాదరక్షలు తొడుగుకొనుట, తలవెంట్రుకలు దువ్వుట, స్నానం చేయుట మొదలైన (ఉపయుక్తమైన) పనులన్నింటినీ కుడి వైపునుండి ప్రారంభించేవారు."అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
హుదైఫా (రదియల్లాహు అన్హు) కధనం : “రాత్రిపూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర నుండి లేచినట్లయితే, వారు ‘సివాక్’ తో (పందోము పుల్లతో) పళ్ళను శుభ్రపరుచుకునేవారు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
జైనబ్ బింత్ జహ్ష్ రదియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భయకంపితులైన స్థితిలో నా వద్దకు వచ్చి, ఇలా అన్నారు: “లా ఇలాహ ఇల్లల్లాహ్! (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడెవరూ లేరు), వచ్చి పడబోయే అరిష్టము నుండి ఈ అరబ్బులు వినాశం గాను...” అంటూ ఆయన తన బొటన వేలిని, చూపుడు వేలునీ కలిపి ఒక వృత్తాకారము చేసి చూపుతూ “...ఈ రోజు, ‘యా’జూజ్’ మరియు మ’జూజ్’ల గోడలో ఇంత రంధ్రం చేయబడింది” అన్నారు”. జైనబ్ బింత్ జహ్ష్ రదియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “అపుడు నేను “ఓ రసూలుల్లాహ్! మనలో దైవభక్తి గల వ్యక్తులు ఉండగా కూడా మనం నశించిపోతామా?" అన్నాను. ఆయన ఇలా అన్నారు: "అవును, దుష్టత్వం ప్రబలినప్పుడు."అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن عائشة رضي الله عنها قالت: كان رسولُ اللهِ صلى الله عليه وسلم إذا فَاتَتْهُ الصَّلَاةُ مِنَ الليلِ مِن وَجَعٍ أَوْ غَيْرِهِ، صَلَّى من النَّهَارِ ثِنْتَيْ عَشْرَةَ رَكْعَةً.رواه مسلم
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలలో నుండి ఒక బృందం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యల వద్దకు వచ్చి, "ఆయన సల్లల్లాహు అలైహి వ సల్లం ఏకాంతంలో ఏయే పనులు (ఆరాధనలు) చేస్తారు?" అని అడిగినారు, వారిలో కొందరు ఇలా అన్నారు: నేను స్త్రీలను వివాహం చేసుకోను. మరికొందరు ఇలా అన్నారు: నేను మాంసం తినను. మరికొందరు ఇలా అన్నారు: నేను మంచం మీద పడుకోను. ఇది తెలిసిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదట అల్లాహ్‌ను స్తుతించారు, తరువాత ఆయనను ప్రశంసించి, ఇలా పలికినారు: "నేను అలా చేయ్యను, నేను ఇలా చేయ్యను అని చెప్పిన వారి గతి ఏమిగాను? నిజానికి, నేను నమాజు చేస్తాను మరియు నిద్ర పోతాను, నేను ఉపవాసం ఉంటాను మరియు ఉపవాసం విరమిస్తాను మరియు నేను స్త్రీలను వివాహం చేసుకుంటాను. నా సున్నతు నుండి తప్పుకున్నవాడు నాకు చెందినవాడు కాదు."అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: إِنَّ خَيَّاطًا دَعَا رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ لِطَعَامٍ صَنَعَهُ، قَالَ أَنَسُ بْنُ مَالِكٍ: فَذَهَبْتُ مَعَ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِلَى ذَلِكَ الطَّعَامِ، فَقَرَّبَ إِلَى رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ خُبْزًا وَمَرَقًا، فِيهِ دُبَّاءٌ وَقَدِيدٌ، فَرَأَيْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَتَتَبَّعُ الدُّبَّاءَ مِنْ حَوَالَيِ القَصْعَةِ، قَالَ: فَلَمْ أَزَلْ أُحِبُّ الدُّبَّاءَ مِنْ يَوْمِئِذٍ.متفق عليه
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్తతో, “ఓ రసూలుల్లాహ్! ముష్రిక్కులకు వ్యతిరేకంగా దుఆ చేయండి” అని అడగగా, ఆయన ఇలా పలికినారు: «నిశ్చయంగా నేను శపించేవానిగా పంపబడలేదు, దానికి బదులు కారుణ్యంగా పంపబడ్డాను»ముస్లిం నమోదు చేసినారు: