Hadith for the World
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (మార్గం)

నికాహ్ విషయంలో మరియు తన ఇంటి వారితో సత్ప్రవర్తన విషయంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (మార్గం)

1 hadiths

1 hadiths

జైనబ్ బింత్ జహ్ష్ రదియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భయకంపితులైన స్థితిలో నా వద్దకు వచ్చి, ఇలా అన్నారు: “లా ఇలాహ ఇల్లల్లాహ్! (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడెవరూ లేరు), వచ్చి పడబోయే అరిష్టము నుండి ఈ అరబ్బులు వినాశం గాను...” అంటూ ఆయన తన బొటన వేలిని, చూపుడు వేలునీ కలిపి ఒక వృత్తాకారము చేసి చూపుతూ “...ఈ రోజు, ‘యా’జూజ్’ మరియు మ’జూజ్’ల గోడలో ఇంత రంధ్రం చేయబడింది” అన్నారు”. జైనబ్ బింత్ జహ్ష్ రదియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “అపుడు నేను “ఓ రసూలుల్లాహ్! మనలో దైవభక్తి గల వ్యక్తులు ఉండగా కూడా మనం నశించిపోతామా?" అన్నాను. ఆయన ఇలా అన్నారు: "అవును, దుష్టత్వం ప్రబలినప్పుడు."అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు