Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:

Available in 43 languages
«అబూహురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: "మృతదేహాన్ని (అంత్యక్రియల కొరకు) త్వరగా తీసుకెళ్లండి ఎందుకంటే అది ధర్మపరునిదైతే, మీరు దానిని శుభానికి పంపుతున్నారు; మరి అది దానికి భిన్నమైనది అయితే, మీరు మీ మెడలో నుండి ఒక చెడును, కీడును తొలగించుకుంటున్నారు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అంత్యక్రియల సన్నాహాలు, ప్రార్థనలు (జనాజా నమాజు) మరియు ఖననం చేయడం వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎందుకంటే మృతదేహం ధర్మబధ్ధునిదైతే, సమాధిలో అత్యంత సంతోషకరమైన జీవితానికి మీరు అతడిని చేర్చి ఆశీర్వదించినవారవుతారు. అది (ఆ మృతదేహం) అందుకు భిన్నన్మైనది అయితే మీరు మీ మెడనుండి ఒక చెడును, కీడును తొలగించుకున్న వారవుతారు.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality