Hadith for the World
Tap the image to view it full size
జీవితచరిత్ర మరియు చరిత్ర

అబూ బక్ర్ అస్'సిద్దీఖ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:

Available in 39 languages
«అబూ బక్ర్ అస్'సిద్దీఖ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “మేము (హిజ్రత్ ప్రయాణంలో) గుహలో ఉన్నప్పుడు, బహుదైవారాధకుల పాదాలు మా తలలకు దగ్గరలోనే ఉండటాన్ని నేను చూసి, నేను ఇలా అన్నాను: ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! వారిలో ఎవరైనా ఒకడు తన పాదాల వైపు చూస్తే, అతడి పాదాల దగ్గర మనం అతడికి కనబడతాము”. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:"ఓ అబూ బకర్, ఆ ఇద్దరు వ్యక్తుల గురించి ఏమంటావు, ఎవరితోనైతే మూడవ వాడుగా అల్లాహ్ ఉంటాడో?"»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

మక్కా నుండి మదీనాకు వలస వెళుతున్న (హిజ్రత్ చేస్తున్న) సందర్భములో అమీరుల్ ము’మినీన్ అబూ బక్ర్ అస్ సిద్దీఖ్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: మేము థూర్ గుహలో (దాక్కుని) ఉన్నప్పుడు, బహుదైవారాధకులు గుహ పైభాగాన మా తలలకు సమీపంలో నిలబడి ఉండగా నేను వారి పాదాలను చూశాను. అపుడు నేను ఇలా అన్నాను, "ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! వారిలో ఎవరైనా తన పాదాల వైపు చూస్తే, అతను మనలను తన పాదాల దగ్గర చూడగలడు." దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, “ఓ అబూ బక్ర్! ఆ ఇద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటి, ఎవరితోనైతే అల్లాహ్ వారితో పాటు మూడవ వానిగా ఉండి వారికి విజయం, సహాయం, రక్షణ మరియు మార్గదర్శకత్వం అందిస్తూ ఉన్నట్లయితే.”

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality