Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు,

Available in 53 languages
«అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు, “మీలో ఎవరైనా ధార్మిక (ఇస్లాం పరంగా) సోదరుడైన మరొక విశ్వాసిని కలిసినపుడు అతనికి ‘సలాం’ చేయాలి (అభివాదము చేయాలి). ఒకవేళ వారి మధ్య ఒక చెట్టు, లేదా ఒక గోడ లేక ఒక పెద్ద శిల వచ్చినట్లైతే (దానిని దాటిన తరువాత) మరల అతణ్ణి కలిసినపుడు కూడా అతనికి సలాం చేయాలి (సలాం చేసి ఒకటి, రెండు నిమిషాలే అయినప్పటికీ).»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలు తమ తోటి ముస్లిం సోదరులను కలుసుకున్నప్పుడల్లా ఒకరికొకరు అభివాదం చేయాలని (సలాం చేయాలని) ప్రోత్సహించడం చూడవచ్చు. వారు కలిసి నడుస్తున్నప్పుడు, వారి మధ్య చెట్టు, గోడ లేదా పెద్ద రాయి వంటి అడ్డంకి వచ్చి దానికి అటువైపు నుండి ఒకరు, ఇటువైపు నుండి ఒకరు నడుస్తూ, తరువాత వారు మళ్ళీ కలుసుకున్నప్పుడు, వారు మళ్ళీ ఒకరికొకరు సలాం చేయాలి – సలాం చేసి ఒకటి, రెండు నిమిషాలే అవుతున్నప్పటికీ.

Source
అబూదావూద్ నమోదు చేసినారు:
Download image

Saved at original quality