Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు:

Available in 45 languages
«అబూ హురైరాహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు: “చెదిరిన జుట్టుతో, శరీరం మీద దుమ్ముతో తలుపుల దగ్గర నిలబడిన చాలామంది ప్రక్కకు నెట్టివేయబడతారు; అయితే అతడు అల్లాహ్ పేరు మీద ఏదైనా ప్రమాణం చేస్తే, అతడు దానిని నెరవేరుస్తాడు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా తెలియజేస్తున్నారు: ప్రజలలో, తలమీద జుట్టు జడలు కట్టుకుపోయి ఉండి, శరీరం దుమ్ము కొట్టుకుపోయి ఉండి, తలకు నూనెగానీ, శరీరానికి స్నానం గానీ లేకుండా ఉండేవాళ్లు కూడా ఉన్నారు. వారికి ప్రజల దృష్టిలో హోదా ఉండదు, ఒక స్థాయి ఉండదు, మరియు వారు తలుపుల దగ్గరినుండి దూరంగా నెట్టివేయబడతారు మరియు ధిక్కారంతో తిరస్కరించబడతారు. అయితే, వారు ప్రమాణం చేస్తే, అల్లాహ్ వారి గౌరవార్థం దానిని నెరవేరుస్తాడు, వారి అభ్యర్థన మంజూరు చేయబడుతుందని నిర్ధారిస్తాడు మరియు అల్లాహ్ వద్ద వారి ఈమాన్ (విశ్వాసము) మరియు హోదా కారణంగా వారు తాము చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించకుండా వారిని రక్షిస్తాడు.

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality