Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

సా’ద్ ఇబ్న్ అబీ వఖ్'ఖా స్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన:

Available in 39 languages
«సా’ద్ ఇబ్న్ అబీ వఖ్'ఖా స్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉండగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు: “మీలో ఎవరైనా ప్రతిరోజూ వెయ్యి పుణ్యాలు సంపాదించలేకపోతున్నారా?" అక్కడ కూర్చుని ఉన్న వారిలో ఒకరు ఇలా అడిగారు: “మాలో ఎవరైనా ఒక రోజులో వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగలరు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ యొక్క ఘనతను కీర్తిస్తూ వంద సార్లు “సుబ్’హానల్లాహ్” అనండి. తద్వారా మీ కొరకు వెయ్యి పుణ్యాలు రాయబడతాయి, లేదా వెయ్యి పాపాలు తుడిచి వేయబడతాయి” అన్నారు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను ఇలా అడిగినారు: మీలో ఎవరైనా ప్రతిరోజూ వెయ్యి పుణ్యాలు సంపాదించలేరా? అక్కడ కూర్చుని ఉన్న సహాబాాలలో ఒకరు అడిగారు: “ఎవరైన ఒక వ్యక్తి అంత తేలికగా ఒక్క రోజులో వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగలడు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఎవరైనా “సుబ్’హానల్లాహ్’ అని వంద సార్లు పలకినట్లయితే, అతని పేర వెయ్యి పుణ్యాలు రాయబడతాయి, ఎందుకంటే ఒక మంచి పని (ప్రతిఫలం) పది రెట్లు గుణించబడుతుంది. లేదా అతని వెయ్యి పాపాలు తుడిచి వేయబడతాయి.

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality