Hadith for the World
దుఆలను,అజ్కార్ లను అర్ధం చేసుకోవటం

అల్లాహ్ అజ్జవజల్ల స్మరణ ప్రయోజనాలు

8 hadiths

8 hadiths

జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను. “ఒక వ్యక్తి తన ఇంటి లోనికి ప్రవేశిస్తే, ప్రవేశించే ముందు మరియు భోజనం చేయడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించినట్లయితే – షైతాను ఇలా అంటాడు “ఈ రాత్రి గడపడానికి మీకు స్థలమూ లేదు మరియు తినడానికి భోజనమూ లేదు”. మరియు (ఆ వ్యక్తి) ఇంటిలోనికి ప్రవేశిస్తే, ప్రవేశించడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే షైతాను ఇలా అంటాడు “రాత్రి గడపాడానికి స్థలం దొరికింది”; మరియు (ఆ వ్యక్తి) భోజనం తినడానికి ముందు అల్లాహ్ నామాన్ని స్మరించనట్లయితే, (షైతాను) ఇలా అంటాడు “రాత్రి గడపడానికి స్థలమూ మరియు భోజనమూ రెండూ దొరికాయి.”ముస్లిం నమోదు చేసినారు:
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికినాడు: నా దాసుడు నా గురించి ఏమని భావిస్తాడో, నేను అతడు భావించినట్లుగానే అతనితో ఉంటాను; అతను తనలో తాను నన్ను స్మరించినప్పుడు నాలో నేను అతడిని స్మరిస్తాను; ఒకవేళ అతడు నన్ను ఏదైనా సమావేశములో స్మరించినట్లయితే, అంతకంటే ఉత్తమమైన సమావేశములో నేను అతడిని ప్రస్తావిస్తాను; ఒకవేళ అతడు ఒక ‘షిబ్ర్’ అంత (జానెడంత) నాకు చేరువ అయితే, నేను ఒక ‘దిరా’ అంత (ఒక మూరెడు) అతనికి చేరువ అవుతాను; ఒకవేళ అతడు ఒక ‘దిరా’ అంత నాకు చేరువ అయితే, నేను ఒక “బాఅ” అంత (ఒక బారెడు) అతనికి చేరువ అవుతాను; ఒకవేళ అతడు నా వైపు నడుచుకుంటూ వస్తే, నేను అతని వైపునకు పరుగెత్తుకుంటూ వస్తాను.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
సా’ద్ ఇబ్న్ అబీ వఖ్'ఖా స్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉండగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు: “మీలో ఎవరైనా ప్రతిరోజూ వెయ్యి పుణ్యాలు సంపాదించలేకపోతున్నారా?" అక్కడ కూర్చుని ఉన్న వారిలో ఒకరు ఇలా అడిగారు: “మాలో ఎవరైనా ఒక రోజులో వెయ్యి పుణ్యాలు ఎలా సంపాదించగలరు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహ్ యొక్క ఘనతను కీర్తిస్తూ వంద సార్లు “సుబ్’హానల్లాహ్” అనండి. తద్వారా మీ కొరకు వెయ్యి పుణ్యాలు రాయబడతాయి, లేదా వెయ్యి పాపాలు తుడిచి వేయబడతాయి” అన్నారు.”ముస్లిం నమోదు చేసినారు:
అబూ మూసా అల్ అష్’అరి (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “తన ప్రభువును (అల్లాహ్’ను) స్మరించు వాడు మరియు తన ప్రభువును (అల్లాహ్’ను) స్మరించని వాడు – వీరిరువురి ఉదాహరణ జీవించి ఉన్న మరియు మరణించిన వానికి మధ్య ఉన్న పోలిక వంటిది”; సహీహ్ ముస్లింలో ఈ హదీథు పదాలు ఇలా ఉన్నాయి: “ఏ ఇంటిలోనైతే అల్లాహ్ నామ స్మరణ జరుగుతుందో, మరియు ఏ ఇంటిలోనైతే అల్లాహ్ నామ స్మరణ జరుగదో, ఆ రెంటి ఉదాహరణ జీవించి ఉన్న వానికి మరియు మరణించిన వానిని పోలియున్నది”.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
కాబ్ బిన్ ఉజ్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు : “నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”ముస్లిం నమోదు చేసినారు:
عن زيد مولى رسول الله صلى الله عليه وسلم قال: قال رسول الله صلى الله عليه وسلم : «من قال: أَسْتَغْفِرُ الله الذي لا إله إلا هو الحَيَّ القيَّومَ وأتوب إليه، غُفرت ذنوبه، وإن كان قد فَرَّ من الزَّحْف».رواه أبو داود والترمذي
అబీ మాలిక్ అష్’అరి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి, సలాహ్ (నమాజు) కాంతి, దానము చేయుట సాక్ష్యము, మరియు ‘సబ్ర్’ (సహనం) కాంతి. ఖుర్’ఆన్ నీ పక్షమున లేక నీకు వ్యతిరేకంగా సాక్ష్యము. ప్రజలు ప్రతి ఉదయం తమ ఇళ్ళనుండి బయలుదేరుతారు, తమ ఆత్మలను అమ్ముకుంటారు – మోక్షప్రాప్తి కొరకు లేక తమను తాము నాశనం చేసుకొనుట కొరకు”.ముస్లిం నమోదు చేసినారు:
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఏడు రకాలవారు ఉన్నారు — అల్లాహ్ తన (అర్ష్) నీడను - ఆ రోజు (ప్రళయ దినం) ఆయన (అర్ష్) నీడ తప్ప మరే నీడ ఉండదు - వారికి ఇస్తాడు: న్యాయమైన పాలకుడు (ఇమామ్ అదుల్), తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు, మస్జిదుతో మనసు ముడిపడిన వ్యక్తి, అల్లాహ్ కోసం పరస్పరం ప్రేమించేవారు — ఆ ప్రేమ కోసం కలిసేవారు, దాని మీదే విడిపోయేవారు, ఒక మహిళ (పదవీ, అందం కలిగినది చెడుపనికి) పిలిచినప్పుడు — "నేను అల్లాహ్‌ను భయపడుతున్నాను" అని చెప్పిన పురుషుడు, దానం చేసినప్పుడు — తన కుడిచేతి దానం ఎడమచేతికి కూడా తెలియకుండా రహస్యంగా ఇచ్చినవాడు, ఒక్కడిగా ఉన్నప్పుడు ఆ ఏకాంతంలో అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నవాడు"అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు