అల్ అఖీద
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన:
Available in 53 languages
«అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా పలికినాడు: నా దాసుడు నా గురించి ఏమని భావిస్తాడో, నేను అతడు భావించినట్లుగానే అతనితో ఉంటాను; అతను తనలో తాను నన్ను స్మరించినప్పుడు నాలో నేను అతడిని స్మరిస్తాను; ఒకవేళ అతడు నన్ను ఏదైనా సమావేశములో స్మరించినట్లయితే, అంతకంటే ఉత్తమమైన సమావేశములో నేను అతడిని ప్రస్తావిస్తాను; ఒకవేళ అతడు ఒక ‘షిబ్ర్’ అంత (జానెడంత) నాకు చేరువ అయితే, నేను ఒక ‘దిరా’ అంత (ఒక మూరెడు) అతనికి చేరువ అవుతాను; ఒకవేళ అతడు ఒక ‘దిరా’ అంత నాకు చేరువ అయితే, నేను ఒక “బాఅ” అంత (ఒక బారెడు) అతనికి చేరువ అవుతాను; ఒకవేళ అతడు నా వైపు నడుచుకుంటూ వస్తే, నేను అతని వైపునకు పరుగెత్తుకుంటూ వస్తాను.”»Meaning translation ·
Saved at original quality








