Hadith for the World
Topic

అల్ అఖీద

135 hadiths

135 hadiths

ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా అల్లాహ్, మీ తండ్రులు, తాతముత్తాతల పేర్ల మీద ఒట్టు పెట్టుకోవడాన్ని, ప్రమాణం చేయడాన్ని నిషేధించినాడు.” ఉమర్ రజియల్లాహు అన్హు కొనసాగిస్తూ ఇంకా ఇలా అన్నారు “అల్లాహ్ సాక్షిగా (చెబుతున్నాను); రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఆ మాటను విన్నప్పటినుండి (ఒట్టువేసి) నేను ఏదైనా చెప్పాలన్నా, లేక ఎవరి మాటనైనా (ఒట్టు వేసి) చెప్పాలన్నా ఎప్పుడూ నా తండ్రి, తాతముత్తాతల పేర్ల మీద ఒట్టు వేయలేదు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “పునరుత్థాన దినమున తీర్పు చేయబడే మొదటి విషయం – అక్రమంగా చిందించబడిన రక్తము” (అన్యాయంగా, అధర్మంగా ఎవరినైనా చంపడం, హత్య చేయడం.)అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారని అబీ మూసా అల్ అష్అరి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఎవరైతే మనకు (విశ్వాసులకు) వ్యతిరేకంగా ఆయుధాలు ఎత్తుతాడో, వాడు మనలోని వాడు కాడు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي واقد الحارث بن عوف رضي الله عنه أنَّ رسول الله صلى الله عليه وسلم بينما هو جالس في المسجد، والناس معه، إذ أقبل ثلاثَةُ نَفَرٍ، فأقبل اثنان إلى رسول الله، صلى الله عليه وسلم وذهب واحد، فوقفا على رسول الله صلى الله عليه وسلم ، فأما أحدهما فرأى فُرْجَةً في الْحَلْقَةِ فجلس فيها، وأما الآخر فجلس خلفهم، وأما الثالث فأدْبَر ذاهبٍا، فلما فرغ رسول الله صلى الله عليه وسلم قال: «ألا أُخْبِرُكُم عن النَّفَرِ الثلاثة: أما أحدهم فأَوَى إلى الله فآوَاهُ الله إليه، وأما الآخر فاسْتَحْيا فاسْتَحْيَا الله منه، وأما الآخر، فأعْرَضَ، فأعرضَ اللهُ عنه».متفق عليه
ఉమర్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: అతడు నల్ల రాయి (కాబాగృహపు ఒక మూలలో ఉన్న హజ్రె అస్వద్) దగ్గరికి వచ్చి, దానిని ముద్దుపెట్టుకుని ఇలా అన్నాడు: "నిజంగా, నువ్వు ఎలాంటి హాని చేయలేని, ఎలాంటి లాభం కలిగించలేని ఒక రాయివి మాత్రమే అనే విషయం నాకు ఖచ్చితంగా తెలుసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిన్ను ముద్దు పెట్టుకోవడం నేను చూడకపోయి ఉంటే, నేనూ నిన్ను ముద్దాడే వాడిని కాను."అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أنس بن مالك رضي الله عنه أنَّ رَجُلاً كَانَ عِند النَبِيَّ صلى الله عليه وسلم فَمَرَّ رَجُلٌ بِهِ، فقال: يا رسول الله، أنِّي لَأُحِبُّ هَذَا، فَقَال لَهُ النَبِيُّ صلى الله عليه وسلم : «أَأَعْلَمْتَهُ؟» قال: لا. قال: «أَعْلِمْهُ»، فَلَحِقَهُ، فقال: إِنِّي أُحِبُّك فِي الله، فقال: أّحَبَّك الَّذِي أَحْبَبْتَنِي لَهُ.رواه أبو داود والنسائي في الكبرى وأحمد
عن يزيد بن حيان قال: انطلقت أنا وحُصين بن سَبْرَة وعمرو بن مسلم إلى زيد بن أرقم رضي الله عنه فلما جلسنا إليه قال له حصين: لقد لقيتَ يا زيد خيرًا كثيرًا، رأيتَ رسول الله صلى الله عليه وسلم وسمعتَ حديثه، وغزوتَ معه، وصليتَ خلفه: لقد لقيت يا زيد خيرًا كثيرًا، حدثنا يا زيد ما سمعت من رسول الله صلى الله عليه وسلم قال: يا ابن أخي، والله لقد كَبِرَتْ سني، وقَدُمَ عهدي، ونسيتُ بعض الذي كنت أَعِي من رسول الله صلى الله عليه وسلم فما حدثتكم فاقبلوا، وما لا فلا تُكَلِّفُونِيهِ. ثم قال: قام رسول الله صلى الله عليه وسلم يومًا فينا خطيبًا بماء يُدعى خُمًّا بين مكة والمدينة، فحمد الله، وأثنى عليه، ووعظ وذكَّر، ثم قال: «أما بعد، ألا أيها الناس، فإنما أنا بشر يُوشِكُ أن يأتي رسول ربي فأُجِيبَ، وأنا تاركٌ فيكم ثَقَلَيْنِ: أولهما كتاب الله، فيه الهدى والنور، فخذوا بكتاب الله، واستمسكوا به»، فحَثَّ على كتاب الله، ورغَّبَ فيه، ثم قال: «وأهل بيتي أُذَكِّرُكُمُ اللهَ في أهل بيتي، أُذَكِّرُكُمُ اللهَ في أهل بيتي» فقال له حصين: ومن أهل بيته يا زيد، أليس نساؤه من أهل بيته؟ قال: نساؤه من أهل بيته، ولكن أهل بيته من حُرِمَ الصدقةَ بعده، قال: ومن هم؟ قال: هم آل علي، وآل عقيل، وآل جعفر، وآل عباس. قال: كل هؤلاء حُرِمَ الصدقةَ؟ قال: نعم. وفي رواية: «ألا وإني تاركٌ فيكم ثَقَلَيْنِ: أحدهما كتاب الله وهو حبل الله، من اتبعه كان على الهدى، ومن تركه كان على ضلالة».رواه مسلم
అనస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రళయ ఘడియను గురించి ప్రశ్నిస్తూ, ఇలా అన్నాడు: “ప్రళయ ఘడియ ఎపుడు సంభవిస్తుంది?” జవాబుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దాని కొరకు నీవు ఏమి తయారు చేసుకున్నావు?” అని ప్రశ్నించారు. దానికి అతడు “ఏమీ లేదు, కేవలం అల్లాహ్ పై, ఆయన సందేశహరుడు సల్లల్లాహు అలైహి వసల్లం పై (హృదయం నిండా) ప్రేమ తప్ప” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు ఎవరినైతే ప్రేమిస్తున్నావో, వారితో పాటే ఉంటావు” అన్నారు. అనస్ రదియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను, అబూబకర్ మరియు ఉమర్‌లను ప్రేమిస్తున్నాను. మరియు నేను వారిలా సత్కార్యాలు ఆచరించలేక పోయినా, వారి పట్ల నాకున్న ప్రేమ కారణంగా (ప్రళయదినాన) నేను వారితో ఉండాలని ఆశిస్తున్నాను, .”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن مرداس الأسلمي رضي الله عنه قَالَ: قَالَ النَّبِيُّ -صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ-: «يذهب الصالحون الأول فالأول، ويبقى حُثَالَةٌ كَحُثَالَةِ الشعير أو التمر لا يُبَالِيهُم الله بَالَةً».رواه البخاري
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మనిషి తన సన్నిహిత మిత్రుని ధర్మాన్ని (అంటే మార్గాలు, విధానాలు మరియు మర్యాదలు) అనుసరిస్తాడు. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరూ తన సన్నిహిత మిత్రునిగా ఎవరిని తీసుకోవాలో అనే విషయంలో జాగ్రత్త వహించాలి.”అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “కటిక చీకటి రాత్రి వలే కష్టాలు చుట్టుకోక ముందే మంచి పనులు చేయుటకు త్వరపడండి. ఒక మనిషి ఉదయం విశ్వాసిగా ఉంటాడు, సాయంత్రానికి అవిశాసిగా మారిపోతాడు; లేక అతడు సాయంత్రం విశ్వాసిగా ఉంటాడు, ఉదయానికి అవిశ్వాసిగా మారిపోతాడు. ప్రాపంచిక లాభం కోసం అతడు తన ధర్మాన్ని అమ్మేస్తాడు”ముస్లిం నమోదు చేసినారు:
عن عائشة رضي الله عنها قالت: «ما غِرْتُ على أحد من نساء النبي صلى الله عليه وسلم ما غِرْتُ على خديجة رضي الله عنها ، وما رأيتها قط، ولكن كان يُكثر ذِكْرَها، وربما ذبح الشَّاةَ، ثم يُقطعها أَعْضَاءً، ثم يَبْعَثُهَا في صَدَائِقِ خديجة، فربما قلت له: كأن لم يكن في الدنيا إلا خديجة! فيقول: «إنها كانت وكانت وكان لي منها وَلَدٌ». وفي رواية: وإن كان لَيَذْبَحُ الشَّاءَ، فيُهدي في خَلَائِلِهَا منها ما يَسَعُهُنَّ. وفي رواية: كان إذا ذَبَحَ الشَّاةَ، يقول: «أرسلوا بها إلى أصدقاء خديجة». وفي رواية: قالت: اسْتَأْذَنَتْ هالة بنت خويلد أخت خديجة على رسول الله صلى الله عليه وسلم فعرف استئذان خديجة، فارْتَاحَ لذلك، فقال: «اللهم هالة بنت خويلد».الرواية الأولى: متفق عليها. الرواية الثانية: متفق عليها. الرواية الثالثة: متفق عليها. الرواية الرابعة: متفق عليها
జైనబ్ బింత్ జహ్ష్ రదియల్లాహు అన్హా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భయకంపితులైన స్థితిలో నా వద్దకు వచ్చి, ఇలా అన్నారు: “లా ఇలాహ ఇల్లల్లాహ్! (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడెవరూ లేరు), వచ్చి పడబోయే అరిష్టము నుండి ఈ అరబ్బులు వినాశం గాను...” అంటూ ఆయన తన బొటన వేలిని, చూపుడు వేలునీ కలిపి ఒక వృత్తాకారము చేసి చూపుతూ “...ఈ రోజు, ‘యా’జూజ్’ మరియు మ’జూజ్’ల గోడలో ఇంత రంధ్రం చేయబడింది” అన్నారు”. జైనబ్ బింత్ జహ్ష్ రదియల్లాహు అన్హా ఇంకా ఇలా అన్నారు: “అపుడు నేను “ఓ రసూలుల్లాహ్! మనలో దైవభక్తి గల వ్యక్తులు ఉండగా కూడా మనం నశించిపోతామా?" అన్నాను. ఆయన ఇలా అన్నారు: "అవును, దుష్టత్వం ప్రబలినప్పుడు."అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “విశ్వాసులలో స్త్రీలు, పురుషులు ఎవరైనా – స్వయంగా వారి విషయంలోనూ, వారి సంతానం విషయంలోనూ, వారి సంపదల విషయంలోనూ పరీక్షించబడుతూనే ఉంటారు - చివరికి వారు తమ ఖాతాలో ఒక్క పాపము కూడా లేకుండా అల్లాహ్’ను కలుసుకునే వరకు.”అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ఒకసారి ఆయన అతా ఇబ్న్ అబీ రబాహ్ తో ఇలా అన్నారు: "స్వర్గవాసులలోని ఒక స్త్రీని నేను నీకు చూపించనా?" దానికి అతా “తప్పనిసరిగా చూపిండి" అని అన్నారు: . అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హు అతనితో ఇలా అన్నారు: “ఆ నలుపు రంగు స్త్రీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నది: “నేను మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాను. దాని కారణంగా (స్పృహ తప్పి పడిపోయినపుడు) నా శరీరం (పై బట్టలు తొలగిపోయి) అనాచ్చాదితం అవుతున్నది. నా కొరకు అల్లాహ్’ ను ప్రార్థించండి”. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నువ్వు కావాలనుకుంటే (ఈ వ్యాధి పట్ల) సహనం వహించు, నువ్వు స్వర్గంలో ప్రవేశిస్తావు; లేదా, నువ్వు కోరుకుంటే, నిన్ను స్వస్థపరచమని నేను అల్లాహ్‌ను వేడుకుంటాను.”. దానికి ఆమె ఇలా అన్నది: “అయితే నేను సహనం వహిస్తాను. అయితే మూర్ఛ స్థితిలో నేను అనాచ్ఛాదితం అవుతున్నాను. నేను అలా అనాచ్ఛాదితం కాకుండా ఉండేలా చూడమని అల్లాహ్’కు దుఆ చేయండి.” ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమె కొరకు ఆ విధంగా దుఆ చేసినారు.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ఉమ్మె అద్’దర్దా మరియు అబూ అద్’దర్దా రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరుచూ ఇలా పలుకుతూ ఉండేవారు: "ఒక ముస్లిం తోటి ముస్లిం సోదరుని పరోక్షములో అతని కోసం చేసే దుఆకు సమాధానం లభిస్తుంది. ప్రతి ముస్లిం తల వద్ద అతని కొరకు నియమించబడిన ఒక దైవదూత ఉంటాడు. ఆ ముస్లిం తోటి ముస్లిం సోదరుడి మంచి కొరకు దుఆ చేసినప్పుడల్లా, అతని కొరకు నియమించబడిన దైవదూత ఇలా అంటాడు: “ఆమీన్, ఇదే మంచిని అల్లాహ్ మీకు కూడా ప్రసాదించు గాక."ముస్లిం నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.”ముస్లిం నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «الإيمانُ بِضْعٌ وَسَبْعُونَ أو بِضْعٌ وسِتُّونَ شُعْبَةً: فَأَفْضَلُهَا قَوْلُ: لا إله إلا الله، وَأَدْنَاهَا إِمَاطَةُ الأَذَى عَنِ الطَّرِيقِ، وَالحَيَاءُ شُعْبَةٌ مِنَ الإِيمَانِ».متفق عليه
عن معاذ بن أنس رضي الله عنه مرفوعًا: «مَن كَظَمَ غَيظًا، وَهُو قادر على أن يُنفِذَه، دَعَاه الله سبحانه وتعالى على رؤوس الخَلاَئِق يوم القيامة حتَّى يُخَيِّره من الحُور العَين مَا شَاء».رواه أبو داود والترمذي وابن ماجه وأحمد
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఓ అల్లాహ్! నా సమాధిని (పూజించబడే) ఒక విగ్రహం మాదిరి కానివ్వకు. అల్లాహ్ వారిని శపించుగాక – ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను సజ్దా (సాష్టాంగం) చేసే స్థలాలుగా చేసుకున్నారో!"ఆహ్మద్ నమోదు చేసినారు:
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు దైవ ప్రవక్త ద్వారా ఉల్లేఖిస్తూ చెబుతున్నారు : నిశ్చయంగా దైవప్రవక్త తెలియజేశారు"నిశ్చయంగా ఎంత పెద్ద ఆపద వస్తే దానికి అంతటి పుణ్యం ఉంటుంది,నిస్సందేహంగా అల్లాహ్ తఆలా ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని పరీక్షకు గురిచేస్తాడు,ఎవరైతే దీంట్లో సహనంగా ఓర్పుతో ఉంటాడో అల్లాహ్ అతనిపట్ల సంతోష పడుతాడు మరెవరైతే విముఖత చూపుతాడో అల్లాహ్ కూడా అతనిపట్ల క్రోధాన్ని చూపుతాడుదాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు - దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “పరమ శుభదాయకుడు, పరమోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా తెలిపినాడు ‘సాటి కల్పించబడే వారందరికన్నా నేను అత్యంత స్వయం సమృధ్ధుడను. సహాయకునిగా, సహ్యోగిగా ఎవరినీ కలిగి ఉండవలసిన అవసరం లేని వాడను. కనుక ఎవరైనా ఏదైనా ఆచరణ ఆచరించి, అందులో ఇతరులతో నాకు సాటి కల్పించినట్లయితే , అతడిని,అతడు సాటి కల్పించిన వాటిని నేను వదిలి వేస్తాను’.ముస్లిం నమోదు చేసినారు:
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా అల్లాహ్ అభిమానవంతుడు, విశ్వాసి కూడా అభిమానవంతుడే. అల్లాహ్ యొక్క అభిమానము అంటే దాసుడు అల్లాహ్ నిషేధించిన వాటికి పాల్బడుట (అనగా అల్లాహ్ యొక్క అభిమానము భంగపడినట్లు).”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా కపటులపై అత్యంత భారమైన నమాజులు ఇషా మరియు ఫజ్ర్ నమాజులు. వాటిలో ఏమి (శుభము దాగి) ఉన్నదో ఒకవేళ వారికి తెలిస్తే, వారు (తమ కాళ్ళపై నడవలేక) ప్రాకుతూ రావలసి వస్తే, అలా ప్రాకుతూ అయినా వస్తారు. నిశ్చయంగా కొన్నిసార్లు నేనిలా అనుకున్నాను – సలాహ్ కొరకు ఆదేశించి (అదాన్ ఇవ్వమని ఆదేశించి), సలాహ్ ప్రారంభించమని చెప్పి (ఇఖామత్ పలుకమని ఆదేశించి), ఒక వ్యక్తిని ప్రజలకు నమాజు చదివించమని ఆదేశించి, తరువాత ఒక వ్యక్తిని కట్టెల మోపుతో నావెంట తీసుకుని బయలుదేరి, నమాజు కొరకు రాని వారి వైపునకు వెళ్ళి, వారిని వారి ఇళ్ళతో సహా తగులబెట్టాలని భావించినాను.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు