TE
అల్ అఖీద
స్నేహము మరియు శతృత్వము (అల్లాహ్,ప్రవక్త కొరకు స్నేహం చేయటం మరియు శతృత్వం చేయటం)
4 hadiths
స్నేహము,శతృత్వము యొక్క ఆదేశములు
2
నిషేధించబడిన అనురూప్యము (పోలిక)
1
విడిచిపెట్టటం మరియు దాని షరతులు
1
4 hadiths
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మనిషి తన సన్నిహిత మిత్రుని ధర్మాన్ని (అంటే మార్గాలు, విధానాలు మరియు మర్యాదలు) అనుసరిస్తాడు. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరూ తన సన్నిహిత మిత్రునిగా ఎవరిని తీసుకోవాలో అనే విషయంలో జాగ్రత్త వహించాలి.”
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబీ అయ్యూబ్ అల్ అన్సారీ రజీయల్లాహు అన్హు ఉల్లేఖనం : "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "(కోపంలో) ఒక ముస్లిం తన తోటి ముస్లిం నుండి మూడు రాత్రులకంటే ఎక్కువ దూరంగా ఉండుట అనుమతించబడలేదు. (మామూలుగా అలాంటి స్థితిలో) ఒకరినొకరు కలిసినా, ఒకరికొకరు వీపు చూపుకుని మరలి పోతారు. అయితే వారిలో ఉత్తముడు ఎవరంటే - ఎవరైతే తోటి వానికి సలాం చెప్పడంలో ముందడుగు వేస్తాడో".
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబీ సిర్మహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైనా ఇతరులకు హాని కలిగించినట్లయితే, అల్లాహ్ అతనికి హాని కలుగజేస్తాడు. మరియు ఎవరైనా ఇతరులను కఠిన పరిస్థితులకు లోను చేసినట్లయితే, అల్లాహ్ అతడికి కఠిన పరిస్థితులను కల్పిస్తాడు”.
అబూ దావూద్, అత్తిర్మిదీ, ఇబ్నెమాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషుడు స్త్రీ వస్త్రాలు ధరించడాన్ని, స్త్రీ పురుషుని వస్త్రాలు ధరించడాన్ని శపించారు.
అన్నసాయీ కుబరాలో, ఇబ్న్ మాజహ్ అదే భావంతో మరియు అహ్మద్ నమోదు చేసినారు: