Hadith for the World
Tap the image to view it full size
అల్ అఖీద

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 56 languages
«అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మనిషి తన సన్నిహిత మిత్రుని ధర్మాన్ని (అంటే మార్గాలు, విధానాలు మరియు మర్యాదలు) అనుసరిస్తాడు. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరూ తన సన్నిహిత మిత్రునిగా ఎవరిని తీసుకోవాలో అనే విషయంలో జాగ్రత్త వహించాలి.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఒక వ్యక్తి తన ప్రవర్తన మరియు అలవాట్లలో తన సన్నిహిత స్నేహితుడిని మరియు సన్నిహిత సహచరుడిని పోలి ఉంటాడు. స్నేహం, నైతికతను, ప్రవర్తనను మరియు చర్యలను ప్రభావితం చేస్తుంది. అందుకని మంచి స్నేహితుడిని ఎంచుకోమని సలహా ఇస్తున్నారు; ఎందుకంటే మంచి మిత్రుడు తన స్నేహితుడిని విశ్వాసం వైపునకు, సన్మార్గం వైపునకు మంచి మరియు శుభం వైపునకు నడిపిస్తాడు.

Source
అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
Download image

Saved at original quality