Hadith for the World
Tap the image to view it full size
అల్ అఖీద

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు:

Available in 62 languages
«అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ పై ప్రమాణం చేసి ఇలా అంటున్నారు – ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదులు కానీ, క్రైస్తవులు కానీ లేక వేరే ఇంకెవరైనా కానీ వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశము చేరిన తరువాత దానిని విని కూడా, ఆ సందేశాన్ని విశ్వసించకుండా (ఇస్లాం ను స్వీకరించకుండా) చనిపోతే, నిశ్చయంగా అటువంటి వాడు నరకవాసులలో ఒకడు అవుతాడు. నరకం లో అతడు శాశ్వతంగా పడిఉంటాడు.

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality