Hadith for the World
Tap the image to view it full size
అల్ అఖీద

ఉమ్మె అద్’దర్దా మరియు అబూ అద్’దర్దా రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరుచూ ఇలా పలుకుతూ ఉండేవారు:

Available in 41 languages
«ఉమ్మె అద్’దర్దా మరియు అబూ అద్’దర్దా రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తరుచూ ఇలా పలుకుతూ ఉండేవారు: "ఒక ముస్లిం తోటి ముస్లిం సోదరుని పరోక్షములో అతని కోసం చేసే దుఆకు సమాధానం లభిస్తుంది. ప్రతి ముస్లిం తల వద్ద అతని కొరకు నియమించబడిన ఒక దైవదూత ఉంటాడు. ఆ ముస్లిం తోటి ముస్లిం సోదరుడి మంచి కొరకు దుఆ చేసినప్పుడల్లా, అతని కొరకు నియమించబడిన దైవదూత ఇలా అంటాడు: “ఆమీన్, ఇదే మంచిని అల్లాహ్ మీకు కూడా ప్రసాదించు గాక."»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఒక ముస్లిం తన తోటి ముస్లిం కొరకు అతను తన దగ్గర లేనపుడు (అతని పరోక్షంలో) చేసే దుఆకు సమాధానం లభిస్తుంది; ఎందుకంటే అది అతని పట్ల గొప్ప నిజాయితీని ప్రదర్శిస్తుంది. దుఆ చేసే వ్యక్తి తల వద్ద ఒక దైవదూత ఉంటాడు, అతను తన సోదరుడికి మంచి జరగాలని దుఆ చేసినప్పుడల్లా ఆ దైవదూత ఇలా అంటాడు: “ఆమీన్, మరియు నీవు కూడా అదే పొందుతావు”.

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality