Hadith for the World
దుఆలను,అజ్కార్ లను అర్ధం చేసుకోవటం

ఉదయం,సాయంత్రం దుఆలు

4 hadiths

4 hadiths

عن عبد الله بن مسعود رضي الله عنه قال: كان نبي الله صلى الله عليه وسلم إذا أمسى قال: «أمسينا وأمسى الملك لله، والحمد لله، لا إله إلا الله وحده لا شريك له» قال الراوي: أَرَاهُ قال فِيهِنَّ: «له الملك وله الحمد وهو على كل شيء قدير، ربِّ أسألك خير ما في هذه الليلة وخير ما بعدها، وأعوذ بك من شر ما في هذه الليلة وشر ما بعدها، رب أعوذ بك من الكسل، وسُوءِ الكِبَرِ، رب أعوذ بك من عذاب في النار، وعذاب في القبر»، وإذا أصبح قال ذلك أيضا «أصبحنا وأصبح الملك لله».رواه مسلم
షద్దాద్ ఇబ్న్ ఔస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా పలికినారు: సయ్యిదుల్ ఇస్తిఘ్’ఫార్: ( అంటే “పాపక్షమాపణ కొరకు చేయు దుఆలలో (ప్రార్థనలలో) ఉత్తమమైన దుఆ): ఇలా పలకాలి: “అల్లాహుమ్మ, అంత రబ్బీ, లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్’తనీ, వ అనా అబ్దుక, వ అనా అలా అహ్’దిక, వ వ’దిక మస్తత’తు, అఊదుబిక మిన్ షర్రి మా సన’తు, అబూఉలక బి ని’మతిక అలయ్య, వ అబూఉలక బి జంబీ ఫగ్’ఫిర్లీ, ఫ ఇన్నహు లా యగ్’ఫిరుజ్జునూబ ఇల్లా అంత” (ఓ అల్లాహ్! నీవే నా ప్రభువు, నీవు తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేరు; నీవు నన్ను సృష్ఠించినావు, నేను నీ దాసుడను, నీ ఒడంబడికకు, నీకు చేసిన వాగ్దానానికి నా సామర్థ్యం మేరకు కట్టుబడి, విశ్వాసపాత్రునిగా ఉంటాను. నా కర్మల కీడు నుండి నీ రక్షణ కోరుతున్నాను. నాపై నీవు అనుగ్రహాలు కురిపించినావని అంగీకరిస్తున్నాను; అలాగే నా పాపాలను అంగీకరిస్తున్నాను. (ఓ అల్లాహ్) నన్ను క్షమించు. నీవు తప్ప పాపాలను క్షమించేవాడు ఎవ్వరూ లేరు). తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: “ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, ఉదయం ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు సాయంత్రానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు. మరియు ఎవరైతే ఈ దుఆ అర్థాన్ని ఖచ్చితంగా ఆకళింపు చేసుకుని, సంపూర్ణ విశ్వాసముతో, రాత్రి ఈ దుఆను ఉచ్ఛరిస్తాడో, ఒకవేళ అతడు ఉదయానికి ముందే మరణిస్తే అలాంటి వ్యక్తి స్వర్గవాసులలో ఒకడు అవుతాడు.”అల్ బుఖారీ నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ ఇబ్నె ఖుబైబ్ రజియల్లాహు అన్హు కధనం : “ఒకనాటి చిమ్మ చీకటి రాత్రి, వర్షం కురుస్తుండగా మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు బయలుదేరినాము, మాకు నమాజు చదివించమని కోరడానికి”. ఆయన ఇంకా ఇలా అన్నారు “నేను ఆయనను పట్టుకున్నాను”. ఆయన (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇలా అను” అన్నారు; నేను ఏమీ అనలేదు. ఆయన మళ్ళీ “ఇలా అను” అన్నారు; నేను ఏమీ అనలేదు. ఆయన తిరిగి “ఇలా అను” అన్నారు. అపుడు నేను “ఏమని అనాలి (ఓ ప్రవక్తా!)” అన్నాను. దానికి ఆయన: “ఖుల్ హువల్లాహు అహద్” (సూరతుల్ ఇఖ్లాస్); మరియు ‘ముఅవ్విజతైన్’ (సూరతుల్ ఫలఖ్ మరియు సూరహ్ అల్-న్నాస్) వీటిని ప్రతి సాయంత్రం మరియు ప్రతి ఉదయం మూడు సార్లు పఠించు; అవి నీకు ప్రతి విషయానికీ సరిపోతాయి (అంటే ప్రతి విషయం నుండీ నీకు రక్షణ కల్పిస్తాయి)” అన్నారు.అబూదావూద్, అత్తిర్మిదీ మరియు అన్నసాయీ నమోదు చేసినారు:
అబూ మస్’ఊద్ అల్ బద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “ఎవరైతే రాత్రి వేళ (పడుకోబోయే ముందు) సూరతుల్ బఖరహ్ యొక్క చివరి రెండు ఆయతులు (వచనాలు) పఠిస్తాడో అది అతనికి సరిపోతుంది.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు