Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:

Available in 70 languages
«అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు కేవలం అల్లాహ్ నుండి మాత్రమే ప్రతిఫలాన్ని ఆశిస్తూ, రమజాన్ నెల ఉపవాసాలు పాటిస్తారో, అతడి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి”.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు – ఎవరైతే అల్లాహ్ నందు విశ్వాసముతో మరియు అల్లాహ్ రమజాన్ నెల ఉపవాసములు ఆచరించుటను విధిగావించినాడనే విషయాన్ని విశ్వసిస్తూ; ఉపవాసములు పాటించే వారి కొరకు అల్లాహ్ తన అంతులేని ఖజానాల నుండి సిధ్ధం చేసి ఉంచిన పారితోషికం, ప్రతిఫలం మరియు పుణ్యఫలముల నందు విశ్వసిస్తూ; ప్రదర్శనా బుధ్ధితో గాక లేదా పేరు ప్రతిష్టల కొరకు గాక, కేవలం అల్లాహ్ ప్రసన్నత కొరకు మాత్రమే సంకల్పించి, రమజాన్ నెల ఉపవాసములు ఆచరిస్తారో అటువంటి వారి పూర్వపు పాపాలన్నీ క్షమించి వేయబడతాయి.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality