సద్గుణాలు మరియు పద్దతులు
ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
Available in 71 languages
«ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం (వాటి వెనుక ఉండే) సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో. కనుక ఎవరి 'హిజ్రత్' కేవలం అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని కొరకు చేయబడుతుందో, ఆ హిజ్రత్ కేవలం అల్లాహ్ కొరకు మరియు ఆయన సందేశహరుని కొరకు చేసినదిగా భావించబడుతుంది. ఎవరి హిజ్రత్ ఈ ప్రపంచపు సౌఖ్యాలను, సదుపాయాలను పొందడానికి లేదా ఏ స్త్రీనైనా వివాహం చేసుకోవడానికి చేయబడుతుందో, అతని హిజ్రత్ దాని కొరకు చేసిన హిజ్రత్ గానే భావించబడుతుంది, దేని కొరకైతే అతడు సంకల్పించినాడో." (హిజ్రత్ - తన స్వస్థలాన్ని లేక స్వదేశాన్ని వదిలి పూర్తిగా వేరే కొత్త ప్రదేశానికి వలస వెళ్ళిపోవుట). బుఖారీ గ్రంథములో ఈ పదాలున్నాయి: ""నిశ్చయంగా ఆచరణల యొక్క ప్రతిఫలం వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్కరూ దానినే పొందుతారు, దేని కొరకైతే వారు సంకల్పించినారో".»Meaning translation ·
Saved at original quality






