సద్గుణాలు మరియు పద్దతులు
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
Available in 62 languages
«అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైతే ఒక విశ్వాసిని ఈ ప్రాపంచిక కష్టాలలోని ఒక కష్టం నుండి విముక్తి చేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ అతడిని ఒక కష్టం నుండి విముక్తి చేస్తాడు. ఎవరైతే ఒక కష్టంలో ఉన్నవారి కష్టాన్ని సులభతరం చేస్తాడో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని కష్టాన్ని సులభతరం చేస్తాడు. ఎవరైతే తోటి ముస్లిం లోపాలను దాచిపెడతారో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని లోపాల్ని దాచి పెడతాడు. అల్లాహ్ యొక్క దాసుడు (ముస్లిం) తన తోటి సోదరునికి సహాయం చేస్తున్నంత కాలం, అల్లాహ్ కూడా ఆ దాసుడికి సహాయం చేస్తాడు. ఎవరైతే జ్ఞానం అన్వేషించే మార్గంలో నడుస్తారో, అల్లాహ్ అతనికి స్వర్గానికి చేర్చే మార్గాన్ని సులభతరం చేస్తాడు. అల్లాహ్ యొక్క గృహాలలో (మస్జిదులలో) నుండి ఒక గృహంలో ప్రజల సమూహం ఒక చోట చేరి, అల్లాహ్ గ్రంథాన్ని పఠిస్తూ, దాన్ని తమలో తాము అధ్యయనం చేస్తుంటే, అల్లాహ్ యొక్క ప్రశాంతత ఆ సమూహంపై వర్షిస్తుంది, ఆయన దయ వారిని ఆవరిస్తుంది, దైవదూతలు వారిని చుట్టుముట్టుతారు మరియు అల్లాహ్ తన సన్నిధిలో ఉన్న వారితో, ఆ సమూహం గురించి ప్రస్తావిస్తాడు. మరియు ఎవరి కర్మలు వారిని వెనుకబడేలా చేస్తాయో, వారి వంశం కూడా వారిని ముందుకు తీసుకు రాలేదు."»Meaning translation ·
Saved at original quality







