Hadith for the World
Tap the image to view it full size
అల్ అఖీద

"అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం :

Available in 71 languages
«"అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : "ఒకరోజు సవారీపై నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లమ్ వెనుక కూర్చుని ఉన్నాను. అపుడు వారు నాతో ఇలా పలికారు "ఓ పిల్లవాడా! నేను నీకు కొన్ని పదాలు నేర్పుతాను (వాటిని బాగా గుర్తుంచుకో) - అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు, అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ ను నీవు నీ ఎదురుగా కనుగొంటావు, ఒకవేళ ఏమైనా కోరుకోవాలంటే, కేవలం అల్లాహ్ నే కోరుకో, ఒకవేళ ఏమైనా సహాయం అర్థించవలసి వస్తే, కేవలం అల్లాహ్ నే సహాయం కొరకు వేడుకో. గుర్తుంచుకో, ఒకవేళ ఈ ఉమ్మత్ (ముస్లిం జాతి మొత్తం), నీకు ఏమైనా ప్రయోజనం కలుగ జేయాలని ఒకచోట గుమిగూడినా, వారందరూ కలిసి నీకు ఏమీ ప్రయోజనం కలుగజేయలేరు, అల్లాహ్ నీకోరకు ముందుగానే నిర్దేశించి ఉంచిన దానిని తప్ప. అలాగే, ఒకవేళ ఈ ఉమ్మత్ (సమాజం మొత్తం), నీకు ఏమైనా హాని (నష్టము) కలుగ జేయాలని ఒకచోట గుమిగూడినా, వారందరూ కలిసి నీకు ఏమాత్రమూ హాని (నష్టము) కలుగజేయలేరు, అల్లాహ్ నీకు వ్యతిరేకంగా ముందుగానే నిర్దేశించి ఉంచిన దానిని తప్ప. కలములన్నీ లేపి వేయబడినాయి, కాగితములన్నీ ఇంకిపోయాయి (ఎండిపోయినాయి). (అంటే, అల్లాహ్ ముందుగానే ప్రతి విషయాన్ని పూర్వ నిర్దేశము గావించి ఉంచినాడని, ఇక దానికి జోడించడానికి లేదా అందునుండి ఏమైనా తీసివేయడానికి ఏమాత్రమూ వీలు లేదు అని అర్థము).»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ఈ హదీసులో ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలియ జేస్తున్నారు: 'తన బాల్యంలో, ఒక సవారీ పై తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లమ్ వెనుక కూర్చుని ఉండగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, తనతో ఇలా అన్నారు "నేను నీకు కొన్ని విషయాలు బోధిస్తాను, వాటి ద్వారా అల్లాహ్ నీకు ప్రయోజనాన్ని కలుగజేస్తాడు." ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా పలికినారు, "ఆయన ఆదేశించిన విషయాలను ఆచరించుటలో మరియు ఆయన నిషేధించిన విషయాలనుండి దూరంగా ఉండుటలో అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు - తద్వారా నీవు ఆయన పట్ల అవిధేయునిగా కాకుండా, విధేయుడైన దాసునిగా ఉంటావు. నీవు గానీ అలా చేస్తే, అల్లాహ్ నిన్ను ఈ ప్రపంచపు ఉపద్రవాలనుండి, పరలోకపు ఉపద్రవాలనుండి కాపాడుతాడు. (ధర్మము, న్యాయము కొరకు) నీవు చేసే కార్యాలలో నీవు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీకు సహాయపడతాడు." ఒకవేళ నీవు ఏమైనా కావాలని వేడుకో దలుచుకుంటే, అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ వేడుకోకు. ఎందుకంటే, కేవలం ఆయన ఒక్కడు మాత్రమే కోరికలు కోరుకునే వారి అభ్యర్థనలకు స్పందిస్తాడు. మరియు నీవు ఏమైనా సహాయం కావాలని కోరుకో దలుచుకుంటే, అల్లాహ్ ను తప్ప మరి ఇంకెవ్వరినీ సహాయం కొరకు వేడుకోకు. వాస్తవాన్ని బాగా గ్రహించు - ఈ భూమిపై నివసించే వారందరూ కలిసి ఒక చోట సమావేశమై నీకు ఏమైనా ప్రయోజనం కలిగించ దలుచుకుంటే, నీకు ఏమీ ప్రయోజనం కలిగించలేరు, అల్లాహ్ నీ కొరకు పూర్వనిర్దేశము గావించిన ప్రయోజనం తప్ప. అలాగే ఈ భూమిపై నివసించే వారందరూ కలిసి ఒక చోట సమావేశమై నీకు ఏమైనా హాని కలిగించ దలుచుకుంటే, నీకు ఏమీ హాని కలిగించ లేరు, అల్లాహ్ నీ కొరకు పూర్వనిర్దేశము గావించినది తప్ప. అల్లాహ్, తనకున్న అపార జ్ఞానము, వివేకములను అనుసరించి, ఈ విషయాలు 'ఇలాగే జరుగుతాయి' ('ఇలాగే జరగాలి' అని కాదు) అని ముందుగానే పూర్వనిర్దేశము చేసి ఉంచినాడు. అల్లాహ్ పూర్వనిర్దేశము చేసిన దానిలో మార్పు ఏమీ ఉండదు.

Source
అత్తిర్మిదీ నమోదు చేసినారు:
Download image

Saved at original quality