Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 47 languages
«అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: మీ కంటే క్రింద ఉన్నవారిని చూడండి; మీ కంటే పైన ఉన్నవారిని చూడకండి. అలా చేయడం వల్ల అల్లాహ్ మీకు ప్రసాదించి అనుగ్రహాలను తక్కువగా భావించకుండా ఉంటారు.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలు తమ కంటే స్థితి, సంపద, గౌరవం వంటి విషయాల్లో తక్కువ స్థాయిలో ఉన్నవారిని చూడాలని, తమ కంటే పై స్థాయిలో ఉన్నవారిని లేదా ప్రపంచ విషయాల్లో మెరుగ్గా ఉన్నవారిని చూడకూడదని ఆదేశించారు. ఇలా చేయడం వలన, మనం అల్లాహ్ ప్రసాదించిన అనుగ్రహాలను తక్కువగా భావించకుండా ఉంటాము. అసంతృప్తి, అసూయ లాంటి భావనలు దూరమవుతాయి, మనలో కృతజ్ఞత, తృప్తి పెరుగుతుంది. (దీని ద్వారా ముస్లింలు అల్లాహ్ ఇచ్చిన అనుగ్రహాన్ని గుర్తించి, దాన్ని చిన్నగా చూడకుండా, కృతజ్ఞతతో జీవించగలుగుతారు.)

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality