Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన:

Available in 54 languages
«అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఉదయమూ ప్రతి సాయంత్రమూ ఈ దుఆ పఠించకుండా ఎప్పుడూ వదిలి వేయలేదు: “అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్దున్యా వల్ ఆఖిరతి, అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్’వ వల్ ఆఫియత ఫీ దీనీ, వ దున్యాయ, వ అహ్’లీ, వ మాలీ, అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ, అవ్: వ ఆమిన్ రౌఆతీ, అల్లాహుమ్మహ్’ఫజ్’నీ మింబైని యదయ్య, వమిన్ ఖల్ఫీ, వ అన్’యమీనీ, వ అన్’షిమాలీ, వమిన్ ఫౌఖీ; వ అఊదు బిఅజ్’మతిక అన్ ఉగ్’తాల మిన్ తహ్’తీ” (ఓ అల్లాహ్, నేను నిన్ను ఇహలోకంలో మరియు పరలోకంలో మంచిని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించమని కోరుతున్నాను; ఓ అల్లాహ్, నేను నిన్ను క్షమించమని మరియు నా ధర్మములో, నా ప్రాపంచిక జీవితంలో, నా కుటుంబంలో మరియు నా సంపదలో శ్రేయస్సు ప్రసాదించమని అడుగుతున్నాను. ఓ అల్లాహ్! నా తప్పులను కప్పివేసి, నా భయాన్ని తగ్గించు; ఓ అల్లాహ్! నా ముందు నుండి, నా వెనుక నుండి, నా కుడి నుండి మరియు నా ఎడమ నుండి మరియు నా పై నుండి నన్ను రక్షించు. మరియు నా క్రింద నుండి హఠాత్తుగా చంపబడకుండా నేను నీ ఘనతను, గొప్పతనాన్ని ఆశ్రయిస్తున్నాను.)»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉదయం మరియు సాయంకాలములలో ఎప్పుడూ ఈ దుఆ చేయకుండా ఉండలేదు. (అల్లాహుమ్మ అస్అలుకల్ ఆఫియత) ఓ అల్లాహ్! నాపై త్వరలో వచ్చి పడబోయే, లేక ఆలస్యంగా వచ్చి పడబోయే వ్యాధులు, దురదృష్టాలు, ప్రాపంచిక ప్రతికూలతలు, కోరికలు మరియు ధర్మపరమైన పరీక్షల నుండి రక్షణ ప్రసాదించి ఇహలోకం లోనూ మరియు పరలోకం లోనూ మంచిని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించమని నేను నిన్ను కోరుతున్నాను. (అల్లాహుమ్మ, ఇన్నీ అస్అలుకల్ అఫ్’వ, వల్ఆఫియత ఫీ దీనీ, వ దున్యాయ, వ అహ్’లీ, వ మాలీ) ఓ అల్లాహ్! నేను నీ క్షమాపణను వేడుకుంటున్నాను, నా పాపాలను తుడిచి వేయమని, మరియు వాటిని ఉపేక్షించమని వేడుకుంటున్నాను, నా తప్పులనుండి నాకు రక్షణ కల్పించి, నా ధర్మములో బహుదైవారాధన నుండి, ధర్మములో కొత్త విషయాలను జొప్పించుట నుండి, నా ప్రాపంచిక జీవితములో కష్ఠాలు, హాని, విపత్తులు మరియు చెడుల నుండి నాకు రక్షణను ఇవ్వమని వేడుకుంటున్నాను; మరియు నా కుటుంబములో, నా భార్యలు, నా సంతానము, నా బంధువులు, నా సంపద, నా ధనము నా ఉద్యోగము అన్నింటిలో శ్రేయస్సు కలిగించమని వేడుకుంటున్నాను. (అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ) ఓ అల్లాహ్, నా లోపాలను, నా దోషాలను, కొరతలను కప్పివేయి, నా పాపాలను తుడిచివేయి, భయం మరియు ఆందోళణలనుండి నన్ను సురక్షితంగా ఉంచు. (అల్లాహుమ్మఫజ్’నీ మిమ్’బైని యదయ్య, వమిన్ ఖల్ఫీ, వఅన్ యమీనీ, వఅన్ షిమాలీ, వ మిన్ ఫౌఖీ) ఓ అల్లాహ్, బాధల నుండి మరియు హానికరమైన వాటి నుండి, నా ముందు నుండి, నా వెనుక నుండి, నా కుడి నుండి, నా ఎడమ నుండి మరియు నా పై నుండి నన్ను రక్షించు. అన్ని దిశల నుండి రక్షించమని అల్లాహ్ కోరడం ఎందుకంటే, ప్రతికూలతలు, దురదృష్టాలు ఈ దిశలలో ఒకదాని నుండి మాత్రమే మనిషిని ప్రభావితం చేయగలవు, మరియు చేరుకోగలవు కనుక. (వ అఊజు బి అజ్మతిక, అన్ ఉగ్'తాల) మరియు ఓ అల్లాహ్! నేను అకస్మాత్తుగా చంపబడకుండా, మరియు నా క్రిందనుండి అకస్మాత్తుగా భూమి నన్ను మ్రింగి వేయకుండా నీ ఘనతను, మరియు నీ గొప్పతనాన్ని ఆశయిస్తున్నాను.

Source
అబూ దావూద్, అన్నసాయీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
Download image

Saved at original quality