Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

జైద్ ఇబ్న్ అర్ఖం రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని పలికేవారో అది తప్ప మరింకేమీ చెప్పను, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు:

Available in 39 languages
«జైద్ ఇబ్న్ అర్ఖం రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని పలికేవారో అది తప్ప మరింకేమీ చెప్పను, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మినల్ అజ్’జి వల్ కసల్; వల్ జుబ్ని వల్ బుఖ్’ల్; వల్ హరమి వల్ అజాబిల్ ఖబ్ర్; అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తఖ్వాహా; వ జక్కిహా అన్’త ఖైరు మన్ జక్కాహా; అన్’త వలియ్యుహా వ మౌలాహా; అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ ఇల్మిన్ లా యన్’ఫఉ; వమిన్ ఖల్బిన్ లా యఖ్’షఉ; వమిన్ నఫ్సిన్ లా తష్’బఉ; వమిన్ ద’వతిన్ లా యుస్తజాబ లహా” { ఓ అల్లాహ్! నేను నీ నుండి అసమర్థత, సోమరితనం, పిరికితనం, లోభితనం, దుర్బలత్వం మరియు సమాధి శిక్షల నుండి శరణు వేడుకుంటున్నాను. ఓ అల్లాహ్! నాకు నీ పట్ల భయభక్తులను ప్రసాదించు మరియు నా ఆత్మను శుద్ధి చేయు, దానిని శుద్ధి చేయడంలో నీవే అత్యుత్తముడివి. నీవే దాని రక్షకుడివి మరియు సంరక్షకుడివి. ఓ అల్లాహ్! ప్రయోజనకరం కాని జ్ఞానము నుండి, భయపడని హృదయము నుండి, సంతృప్తి చెందని ఆత్మ నుండి మరియు సమాధానం లభించని దుఆ (ప్రార్థన) నుండి నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను.}»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన ప్రార్థనలలో ఒకటి: "ఓ అల్లాహ్, నేను నిన్ను ఆశ్రయిస్తున్నాను"; "అసమర్థత" నుండి, అంటే సమర్థవంతంగా పనిచేయలేకపోవడం నుండి, "నిరాశ" నుండి అంటే చర్య తీసుకోవాలనే, పని చేయాలనే సంకల్పం లేకపోవడం నుండి నీ వైపునకు మాత్రమే మరలుతున్నాను. అసమర్థుడు చర్య తీసుకోలేడు మరియు సోమరి అలా చేయాలనుకోడు. "పిరికితనం" నుండి, అది చేయవలసిన పని చేయకుండా ఆపుతుంది, "పిసినారితనం" నుండి, అది ఇవ్వవలసినది ఇవ్వకుండా ఆపి ఉంచుకునేలా చేస్తుంది, "ముదిమి" నుండి, అది శరీరం బలహీనపడటానికి దారి తీస్తుంది, "సమాధి శిక్ష" నుండి మరియు దానికి దారితీసే కారణాల నుండి (ఓ అల్లాహ్! నీ శరణు వేడుకుంటున్నాను). "ఓ అల్లాహ్! నాకు భక్తి భావాన్ని ప్రసాదించు మరియు నీ విధేయత వైపునకు నా ఆత్మను నడిపించు మరియు నీ అవిధేయతకు పాల్బడకుండా నివారించు మరియు నా ఆత్మను శుద్ధి చేయి, దానిని దుర్గుణాల నుండి మరియు నీచమైన లక్షణాల నుండి శుద్ధి చేయి. నీవు తప్ప మరెవ్వరూ దానిని పవిత్రం చేయలేరు, దానిని పవిత్రపరుచుటలో నీవే అత్యుత్తముడవు. "నీవే దాని రక్షకుడవు", దాని సహాయకుడవు, సంరక్షకుడవు, దాని వ్యవహారాలను నిర్వహించేవాడవు, దాని ప్రభువు, యజమాని, మరియు ఆశీర్వాదాలను ప్రసాదించే వాడవు.” “ఓ అల్లాహ్! ప్రయోజనకరం కాని జ్ఞానము నుండి నేను నిన్ను శరణు వేడుకుంటున్నాను” అంటే, జాదూ, జ్యోతిషం, భవిష్యవాణి మరియు మాయాజాలం లేదా పరలోకంలో ఎటువంటి ప్రయోజనం చేకూర్చని ఙ్ఞానం నుండి, లేదా ఆచరించదగని ఙ్ఞానము నుండి నీ శరణు వేడుకుంటున్నాను; “మరియు నీకు భయపడని హృదయము నుండి నీ శరణు వేడుకుంటున్నాను”; నీ ముందు నీ విధేయతకు తనను తాను సమర్పించుకోని హృదయం నుండి, నీ స్మరణలో శాంతి పొందని హృదయం నుండి; మరియు నీలో భరోసా పొందని హృదయం నుండి నీ శరణు వేడుకుంటున్నాను. “సంతృప్తి చెందని ఆత్మ నుండి నీ శరణు వేడుకుంటున్నాను”, ఓ అల్లాహ్! నీవు ధర్మబధ్ధంగా ప్రసాదించిన దాని పట్ల సంతృప్తి చెందని ఆత్మ నుండి, ఎల్లప్పుడూ దురాశకు లోనయ్యే ఆత్మ నుండి నీ శరణు వేడుకుంటున్నాను; మరియు తిరస్కరించబడిన మరియు సమాధానం లభించని దుఆ నుండి (వేడుకోలు నుండి) నీ శరణు వేడుకుంటున్నాను.

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality