Hadith for the World
Tap the image to view it full size
సద్గుణాలు మరియు పద్దతులు

అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 68 languages
«అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ సంతానము కంటే, మీ తల్లిదండ్రుల కంటే మరియు ప్రజలందరి కంటే నేను మీకు అత్యంత ప్రియమైన వాడిని కానంతవరకు మీరు పరిపూర్ణ (Perfect) విశ్వాసాన్ని పొందజాలరు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో – ఒక ముస్లిం – తన తల్లిపై తనకు గల ప్రేమ కంటే, తన తండ్రిపై తనకు గల ప్రేమ కంటే, తన కుమారులపై, తన కుమార్తెలపై తనకు గల ప్రేమ కంటే మరియు ఈ ప్రపంచములోని మనుషులందరిపై తనకు గల ప్రేమకంటే – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై తనకు గల ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడో, అతడు తన ‘ఈమాన్’ (విశ్వాసములో) పరిపూర్ణత కలిగిన వాడు కాడు. పైన పెర్కొన్న అందరిపై ప్రేమ కంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై తనకు గల ప్రేమకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడమంటే, ప్రతి విషయములో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ను అనుసరించడం, ప్రతివిషయములోనూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అండగా నిలవడం, మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ఏ కొద్ది అవిధేయత ఉన్నా దానిని విడనాడడం మొదలైనవన్నీ వస్తాయి.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality