పవిత్ర ఖుర్ఆన్ మరియు దాని శాస్త్రాలు
అబూ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
Available in 60 languages
«అబూ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఖుర్’ఆన్ పఠించే విశ్వాసి యొక్క ఉపమానము దబ్బపండు వంటిది; దాని వాసనా మంచిగా ఉంటుంది మరియు రుచి కూడా మంచిగా ఉంటుంది. ఖుర్’ఆన్ పఠించని విశ్వాసి యొక్క ఉపమానము ఖర్జూరము వంటిది; దానికి వాసన ఉండదు, కానీ రుచి తీయగా ఉంటుంది. ఖుర్’ఆన్ పఠించే కపట విశ్వాసి ఉపమానము సబ్జా మొక్క వంటిది, దానికి మంచి వాసన ఉంటుంది, కానీ దాని రుచి చేదుగా ఉంటుంది; అలాగే ఖుర్’ఆన్ పఠించని కపట విశ్వాసి ఉపమానము చేదు పుచ్చకాయ వంటిది, దానికి ఎటువంటి వాసనా ఉండదు, పైగా దాని రుచి చేదుగా ఉంటుంది.”»Meaning translation ·
Saved at original quality








