Hadith for the World
Tap the image to view it full size
పవిత్ర ఖుర్ఆన్ మరియు దాని శాస్త్రాలు

అబూ దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 49 languages
«అబూ దర్దా రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైతే సూరతుల్ కహఫ్ యొక్క మొదటి పది ఆయతులను (వచనాలను) కంఠస్థం చేస్తారో, వారు దజ్జాల్ ఫిత్నా నుండి రక్షించబడతారు." మరొక రివాయతులో "సూరతుల్ కహఫ్ యొక్క చివరి పది ఆయతులు." అని ఉంది.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు: 'ఎవరైతే సూరతుల్ కహఫ్ ప్రారంభం నుండి పది ఆయతులను కంఠస్థము చేస్తారో, వారు చివరి కాలంలో ప్రత్యక్షమయ్యే, దైవత్వాన్ని ప్రకటించుకునే దజ్జాల్ యొక్క పరీక్ష నుండి సంరక్షించబడతారు, కాపాడబడతారు మరియు రక్షించబడతారు. దజ్జాల్ పరీక్ష, ఆదామ్ అలైహిస్సలాం సృష్టి నుండి ప్రళయ దినం వరకు భూమిపై సంభవించే పరీక్షలలో అతి గొప్ప పరీక్ష. ఎందుకంటే మహోన్నతుడై అల్లాహ్, దజ్జాల్ ప్రజలను మోసగించేలా అనేక అసాధారణ శక్తులను ప్రదర్శించే అనుమతి అతడికి ఇస్తాడు. ఈ సంరక్షణ రహస్యం: సూరతుల్ కహ్ఫ్ ప్రారంభంలోని ఆయతులలో దజ్జాల్ ప్రదర్శించే అద్భుతాల కంటే గొప్ప అద్భుతాలు మరియు సూచనలను కలిగి ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఈ ఆయతులను పఠిస్తూ ఉంటారో, వారు దజ్జాల్ చేత మోసపోరు. మరొక హదీథు ప్రకారం: 'సూరహ్ చివరి పది ఆయతులను - అల్లాహ్ వాక్కు {అఫహసిబల్లదీన కఫరూ (అవిశ్వాసులు నా దాసులను...} (18:102) నుండి ప్రారంభమయ్యే సూరహ్ చివరి భాగాన్ని కంఠస్థం చేసిన వారికి కూడా ఈ సంరక్షణ లభిస్తుంది.'"

Source
ముస్లిం నమోదు చేసినారు:
Download image

Saved at original quality