Hadith for the World
Tap the image to view it full size
అల్ అఖీద

సుఫ్యాన్ ఇబ్న్ అబ్దుల్లాహ్ అస్సఖఫీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :

Available in 65 languages
«సుఫ్యాన్ ఇబ్న్ అబ్దుల్లాహ్ అస్సఖఫీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్, నేను మిమ్మల్ని తప్ప మరింకెవరినీ ప్రశ్నించ వలసిన అవసరం లేని విధంగా – నాకు ఇస్లాం ను గురించి బోధించండి.” దానికి ఆయన ఇలా అన్నారు: “నేను అల్లాహ్ ను విశ్వసించాను” అని (మనస్పూర్తిగా) పలుకు; మరియు దానిపై స్థిరంగా ఉండు.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబాలలో ఒకరైన సుఫ్యాన్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు. “ఇస్లాం యొక్క అర్థం పూర్తిగా, సమగ్రంగా పొందుపరిచి ఉండేలా; తద్వారా తాను దానికి విశ్వాసపాత్రునిగా ఉండేలా, మరియు దాని గురించి ఇంకెవరినీ ప్రశ్నించే అవసరం లేని విధంగా, ఒక వాక్యాన్ని తనకు బోధించమని” ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో (మనస్ఫూర్తిగా) ఇలా పలుకు అన్నారు: “నేను అల్లాహ్ యొక్క ఏకత్వాన్ని స్థిరపరుస్తున్నాను, ఆయనను విశ్వసిస్తున్నాను, ఆయనే నా ప్రభువు, మరియు ఆయనే ఏకైక ఆరాధ్యుడు, ఆయనే నా సృష్టికర్త, మరియు ఆయనే నేను సత్యపూర్వకంగా ఆరాధించేవాడు, ఆయనకు సాటి, సమానులు ఎవరూ లేరు”. “తరువాత అల్లాహ్ అనుమతించిన మరియు ఆదేశించిన వాటిని ఆచరిస్తూ, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ ఆయనకు విధేయునిగా ఉండు, ఆ విధేయతపై స్థిరంగా ఉండు.”

Source
ముస్లిం మరియు అహ్మద్ నమోదు చేసినారు:
Download image

Saved at original quality