Hadith for the World
Tap the image to view it full size
ఫిఖ్ మరియు దాని నియమాలు

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:

Available in 45 languages
«అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు, అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు." అపుడు సహచరులు ఇలా అడిగారు: "ఎవరు, ఓ రసూలల్లాహ్?" దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: "ఎవరి చెడు వలన అతడి పొరుగువారు సురక్షితంగా ఉండలేరో."»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా మూడుసార్లు ప్రమాణం చేసి మరీ, తను చెప్పబోతున్న విషయంలోని గంభీరతను ధృవీకరించారు: "అల్లాహ్ మీద ప్రమాణం! అతను విశ్వాసి కాడు," దానికి సహచరులు ఆయనను ఇలా అడిగారు: "ఓ రసూలుల్లాహ్! ఎవరు విశ్వాసి కాడు?" అపుడ ఆయన ఇలా జవాబు ఇచ్చారు: "పొరుగువాడు ఎవరి ద్రోహం, అన్యాయం మరియు చెడుకు భయపడతాడో, అతడు (ముమిన్ అంటే విశ్వాసి కాజాలడు)."

Source
అల్ బుఖారీ నమోదు చేసినారు:
Download image

Saved at original quality