Hadith for the World
పవిత్ర ఖుర్ఆన్ మరియు దాని శాస్త్రాలు

ఖుర్ఆన్ తఫ్సీర్

2 hadiths

2 hadiths

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “సూర్యుడు పడమర నుండి ఉదయించనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. సూర్యుడు పడమర నుండి ఉదయించి నపుడు ప్రజలు దానిని చూస్తారు. అపుడు ప్రజలందరూ (అల్లాహ్ ను) విశ్వసిస్తారు. అయితే, అది ఎటువంటి సమయమంటే – ‘పూర్వం విశ్వసించకుండా, ఆరోజున విశ్వసించిన వ్యక్తికీ లేదా విశ్వసించి కూడా ఏ పుణ్యాన్నీ సంపాదించుకోని వ్యక్తికీ, తన విశ్వాసం వల్ల (ఆ రోజు) ఏ ప్రయోజనం చేకూరదు’ (సూరహ్ అల్ అన్’ఆమ్ 6:158). ప్రళయ ఘడియ స్థాపించ బడినపుడు, (అది ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే), (కూర్చోవడానికి) తమ మధ్య ఒక వస్త్రాన్ని పరుచుకుంటున్న ఇద్దరు వ్యక్తులు దానిని పూర్తిగా పరచలేరు, మరియు దానిని మడత పెట్టనూ లేరు; ప్రళయ ఘడియ ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే, త్రాగడానికి చేతిలో ఒంటె పాల గ్లాసును పట్టుకుని ఉన్న వ్యక్తి దానిని త్రాగలేడు, తన పశువులు నీరు త్రాగడానికి గుంటను త్రవ్వుతున్న వ్యక్తి దానిని పూర్తి చేయలేడు; ప్రళయ ఘడియ ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే, మీలో ఒకరి చేతిలో ఉన్న అన్నం ముద్ద నోటి వరకూ కూడా చేరదు (అంత హఠాత్తుగా వచ్చి పడుతుంది అని అర్థం).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: (మక్కా నగరానికి వెళ్ళడానికి అనుమతి నిరాకరించబడి) వెంట తీసుకు వెళ్ళిన బలి పశువులను హుదైబియాలోనే వధించి, తిరుగు ప్రయాణంలో సహచరులందరూ దుఃఖం మరియు బాధలో మునిగిపోయినప్పుడు, రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఈ ఆయతు అవతరించినది {ఇన్నా ఫతహ్నా లక ఫత్’హన్ ముబీనా లియఘ్ఫిర లకల్లాహు... (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము; నీ పూర్వపు మరియు భావి కాలపు తప్పులను క్షమించటానికి} నుండి మొదలుకుని ఆయన వాక్కు {…ఫౌజన్ అజీమా - ఇది ఒకగొప్ప విజయం.} వరకు [సూరహ్ అల్ ఫత్’హ్ 48:1-5]. ఆ సమయములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఇలా అన్నారు: “నిశ్చయంగా నాపై, ఈ మొత్తం ప్రపంచం కంటే నాకు అత్యంత ప్రియమైన ఒక ఆయతు అవతరించింది”.ముస్లిం నమోదు చేసినారు: