పవిత్ర ఖుర్ఆన్ మరియు దాని శాస్త్రాలు
అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన:
Available in 36 languages
«అనస్ బిన్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: (మక్కా నగరానికి వెళ్ళడానికి అనుమతి నిరాకరించబడి) వెంట తీసుకు వెళ్ళిన బలి పశువులను హుదైబియాలోనే వధించి, తిరుగు ప్రయాణంలో సహచరులందరూ దుఃఖం మరియు బాధలో మునిగిపోయినప్పుడు, రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై ఈ ఆయతు అవతరించినది {ఇన్నా ఫతహ్నా లక ఫత్’హన్ ముబీనా లియఘ్ఫిర లకల్లాహు... (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నీకు స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము; నీ పూర్వపు మరియు భావి కాలపు తప్పులను క్షమించటానికి} నుండి మొదలుకుని ఆయన వాక్కు {…ఫౌజన్ అజీమా - ఇది ఒకగొప్ప విజయం.} వరకు [సూరహ్ అల్ ఫత్’హ్ 48:1-5]. ఆ సమయములో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)ఇలా అన్నారు: “నిశ్చయంగా నాపై, ఈ మొత్తం ప్రపంచం కంటే నాకు అత్యంత ప్రియమైన ఒక ఆయతు అవతరించింది”.»Meaning translation ·
Saved at original quality








