Hadith for the World
Tap the image to view it full size
పవిత్ర ఖుర్ఆన్ మరియు దాని శాస్త్రాలు

ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు:

Available in 66 languages
«ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఉత్తములు ఎవరంటే, ఎవరైతే ఖుర్ఆన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు బోధిస్తారో”.»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: విశ్వాసులలో ఉత్తములు మరియు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానములు పొందు వారు ఎవరంటే, ఎవరైతే ఖుర్ఆన్ ను నేర్చుకుంటారో మరియు ఇతరులకు నేర్పిస్తారో (బోధిస్తారో) – అంటే, ఖుర్ఆన్ ను, దానిని పఠించే నియమాలను అనుసరించి పఠించడాన్ని, పఠించిన దానిని కంఠస్థము చేయడాన్ని, ఖుర్ఆన్ ను భావయుక్తంగా, మధురంగా పఠించడాన్ని, మరియు అందులోని ఆదేశాలను అవగాహన చేసుకోవడాన్ని, అలాగే దాని విశ్లేషణను నేర్చుకుంటాడో - అలాగే తాను నేర్చుకున్న ఖుర్ఆన్ శాస్త్రాలలో ఉన్న ఙ్ఞానాన్ని ఇతరులకు బోధిస్తాడో, అలాగే ఆ ఙ్ఞానము ప్రకారము ఆచరిస్తూ ఉంటాడో – అటువంటి వాడు ఉత్తముడు మరియు అల్లాహ్ వద్ద ఉన్నత స్థానమును పొందువాడు అవుతాడు.

Source
అల్ బుఖారీ నమోదు చేసినారు:
Download image

Saved at original quality