Hadith for the World
ఫిఖ్ మరియు దాని నియమాలు

ఆరాధనల ధర్మశాస్త్ర జ్ఞానం

231 hadiths

231 hadiths

అబీ హురైరాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “దానము చేయుట సంపదను తగ్గించదు. ఇతరులను క్షమించే గుణం కారణంగా అల్లాహ్ దాసుని గౌరవాన్ని పెంపొందింప జేస్తాడు మరియు ఎవరైతే కేవలం అల్లాహ్ కొరకు అణకువ, వినయం అలవర్చుకుంటాడో, అల్లాహ్ అతడి స్థానాన్ని ఉన్నతం చేస్తాడు”.ముస్లిం నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ ఇబ్న్ సలాం రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా నగరానికి తరలి వచ్చినపుడు ప్రజలు ఆయనను చూడడానికి తండోపతండాలుగా వెళ్ళారు. ప్రజలు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు; రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు; రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు” అని మూడు సార్లు అన్నారు. నేను వారితో కలిసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూడడానికి వచ్చాను. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను చూడటానికి ప్రజలతో వచ్చాను; ఆయన ముఖం స్పష్టంగా చూసిన వెంటనే “ఇది ఒక అబద్ధాలకోరు ముఖం కాదు” అని నాకు తెలిసిపోయింది. ఆయన నుండి ప్రత్యక్షంగా నేను విన్న మొట్టమొదటి మాటలు ఇవి: “ఓ ప్రజలారా, ‘సలాం’ను (శాంతి, శుభాకాంక్షలను) వ్యాప్తి చేయండి, ఇతరులకు అన్నం పెట్టండి, బంధుత్వ సంబంధాలను కొనసాగించండి మరియు ప్రజలు నిద్రిస్తున్న వేళ ‘ఖియాముల్లైల్ ప్రార్థనలు’ (రాత్రి ప్రార్థనలు) చేయండి మరియు మీరు శాంతితో స్వర్గంలోకి ప్రవేశిస్తారు.”అత్తిర్మిదీ, ఇబ్న్ మాజహ్ మరియు అహ్మద్ నమోదు చేసినారు:
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ప్రకటన: “ఓ ఆదము కుమారుడా! (అల్లాహ్ మార్గములో) ఖర్చు చేయి, నీపై ఖర్చు చేయబడుతుంది (అంటే అల్లాహ్ నీపై ఖర్చు చేస్తాడు, ప్రసాదిస్తాడు అని అర్థము).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أبي موسى الأشعري رضي الله عنه مرفوعاً: «على كل مسلم صدقة» قال: أرأيت إن لم يجد؟ قال: «يعمل بيديه فينفع نفسه ويتصدق» قال: أرأيت إن لم يستطع؟ قال: «يُعِينُ ذا الحاجة المَلْهُوفَ» قال: أرأيت إن لم يستطع، قال: «يأمر بالمعروف أو الخير». قال: أرأيت إن لم يفعل؟ قال: «يُمسك عن الشر، فإنها صدقة».متفق عليه
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «إذا أَمَّنَ الإمام فأمنوا، فإنه من وافق تأمينه تأمين الملائكة: غفر له ما تقدم من ذنبه».متفق عليه
عن عائشة رضي الله عنها : أن النبي صلى الله عليه وسلم دخل عليها وعندها امرأة، قال: «من هذه؟» قالت: هذه فلانة تذكر من صلاتها. قال: «مَهْ، عليكم بما تطيقون، فوالله لا يَمَلُّ الله حتى تَمَلُّوا» وكان أحب الدين إليه ما داوم صاحبه عليه.متفق عليه
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «تُعْرَضُ الأعمالُ يومَ الاثنين والخميس، فَأُحِبُّ أَنْ يُعْرَضَ عَملي وأنا صائم». وفي رواية: «تُفْتَحُ أبوابُ الجَنَّةِ يومَ الاثنين والخميس، فَيُغْفَرُ لكلِّ عبد لا يُشْرِكُ بالله شيئا، إِلا رجلا كان بينه وبين أخيه شَحْنَاءُ، فَيُقَالُ: أَنظِروا هذيْن حتى يَصْطَلِحَا، أنظروا هذين حتى يصطلحا». وفي رواية: «تُعْرَضُ الأَعْمَالُ في كلِّ اثْنَيْنِ وَخَميسٍ، فَيَغْفِرُ اللهُ لِكُلِّ امْرِئٍ لا يُشْرِكُ بالله شيئاً، إِلاَّ امْرَءاً كانت بينه وبين أخِيهِ شَحْنَاءُ، فيقول: اتْرُكُوا هذَيْنِ حتى يَصْطَلِحَا».حديث أبي هريرة الأول رواه الترمذي. والحديثان الآخران هما حديث واحد، رواه مسلم، وكرر لفظة: "أنظروا هذين حتى يصطلحا" ثلاثاً
عن عائشة رضي الله عنها أنّ رسولَ اللهِ صلى الله عليه وسلم كانَ يقول في ركوعه وسجودِه: «سبُّوحٌ قُدُّوسٌ رَبُّ المَلاَئِكَةِ وَالرُّوحِ».رواه مسلم
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «إنما جُعِلَ الإمام ليِؤُتَمَّ به، فلا تختلفوا عليه، فإذا كبر فكبروا، وإذا ركع فاركعوا، وإذا قال: سمع الله لمن حمده، فقولوا: ربنا ولك الحمد. وإذا سجد فاسجدوا، وإذا صلى جالسا فصلوا جلوسا أجمعون».متفق عليه
عن عمرو بن العاص رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال: «فَصْلُ مَا بَيْنَ صِيَامِنَا وصِيَامِ أهْلِ الكِتَابِ، أكْلَةُ السَّحَرِ».رواه مسلم
ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో అత్యంత ఉదారంగా ఉండేవారు. రమదాన్ నెలలో జిబ్రీల్ (అలైహిస్సలాం) ఆయనను కలిసినపుడు ఆయన దాతృత్వం, ఉదారత మరింతగా పెరిగిపోయేవి. జిబ్రీల్ (అలైహిస్సలాం) రమదాన్ మాసములో ప్రతి రాత్రి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చేవారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కలిసి ఖుర్’ఆన్ పునశ్చరణ చేయుట కొరకు. అపుడు దాతృత్వములో, ఉదారతలో, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వేగవంతమైన గాలి కంటే కూడా ఎక్కువ వేగంగా ఉండేవారు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
عن أنس بن مالك رضي الله عنه قال: كان رسولُ اللهِ صلى الله عليه وسلم يُفطِر قبْل أن يصلي على رُطَبات، فإن لم تكنْ رُطَباتٌ فَتُمَيْراتٌ، فإن لم تكنْ تُمَيْراتٌ، حَسَا حَسَواتٍ مِن ماء.رواه أبو داود والترمذي وأحمد
عن عائشة رضي الله عنها قالت: لم يكن النبي صلى الله عليه وسلم يصوم مِنْ شهر أكثر من شعبان، فإنّه كان يصوم شعبان كله. وفي رواية: كان يصوم شعبان إلا قليلا.متفق عليه
అబూ జుహైర్ ఉమారహ్ ఇబ్న్ రుఐబహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే సూర్యుడు ఉదయించడానికి ముందున్న నమాజును (సలాహ్’ను) మరియు సూర్యుడు అస్తమించడానికి ముందున్న నమాజును ఆచరిస్తాడో అతడు నరకాగ్నిలోనికి ప్రవేశించడుముస్లిం నమోదు చేసినారు:
عن عبدالله بن عباس رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال: «لَئِن بَقِيتُ إلى قابلٍ لأصومنّ التاسِع».رواه مسلم
ఉస్మాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “ఏ ముస్లిం వ్యక్తి అయినా, సలాహ్ (నమాజు) సమయం ఆసన్నమైనపుడు పరిపూర్ణంగా ఉదూ ఆచరించి, అణకువ, వినయం కలిగి, సలాహ్’లో రుకూ (మొదలైన వాటిని) పరిపూర్ణంగా ఆచరిస్తాడో, అది అతని వల్ల అంతకు ముందు వరకు జరిగిన ‘సగాయిర్’ పాపాలకు (చిన్న పాపాలకు) పరిహారంగా మారుతుంది; అతడు ‘కబాయిర్’ పాపాలకు (పెద్ద పాపాలకు) పాల్బడనంత వరకు; మరియు ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది.”ముస్లిం నమోదు చేసినారు:
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా పలికినారు: “ఈ దినములలో చేసే సత్కార్యాలు (అంటే జిల్ హిజ్జహ్ నెల మొదటి పది దినములలో చేసే సత్కార్యాలు) మిగతా ఏ దినములలో చేసే సత్కార్యాల కన్నా కూడా అల్లాహ్’కు అత్యంత ప్రియమైనవి.” (వింటున్న) వారు ఇలా ప్రశ్నించినారు: “ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! అల్లాహ్ మార్గములో చేసే జిహాదు కంటే కూడా గొప్పవా?” దానికి ఆయన “అవును, అల్లాహ్ మార్గములో చేసే జిహాదు కూడా (ఈ పది దినములలో చేసే సత్కార్యాల కన్నా) గొప్పది కాదు; అయితే తన ప్రాణాన్ని, తన సంపదను వెంట తీసుకుని జిహాదు కొరకు వెళ్ళి, ఆ రెండింటిలో ఏ ఒక్క దానితోనూ వెనుకకు తిరిగి రాని వాని జిహాదు తప్ప” అన్నారు.అల్ బుఖారీ మరియు అబూదావూద్ నమోదు చేసినారు, అవే పదాలతో
కాబ్ బిన్ ఉజ్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు : “నిత్యమూ అనుసరించదగిన కొన్ని విషయాలున్నాయి - ప్రతి ఫర్జ్ సలాహ్ (ఫర్జ్ నమాజు) తరువాత వాటిని ఉచ్ఛరించే వానిని, లేదా వాటిని ఆచరించే వానిని అవి ఎప్పుడూ నిరాశపరచవు. అవి: ముప్పై మూడు సార్లు ‘తస్’బీహ్’ పలుకుట (సుబ్’హానల్లాహ్ అని పలుకుట); ముప్పై మూడు సార్లు ‘తమ్’హీద్’ పలుకుట (అల్’హందులిల్లాహ్ అని పలుకుట); మరియు ముప్పై నాలుగు సార్లు ‘తక్బీర్’ పలుకుట (అల్లాహు అక్బర్ అని పలుకుట).”ముస్లిం నమోదు చేసినారు:
బురైదహ్ ఇబ్న్ అల్ హసీబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “సలాతుల్ అస్ర్’ను (అస్ర్ నమాజును) ఆచరించుటలో త్వరపడండి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే సలాతుల్ అస్ర్ ను వదిలివేసినాడో (ఆచరించలేదో) అతని ఆచరణలు అన్నీ వృధా చేయబడతాయి.”అల్ బుఖారీ నమోదు చేసినారు:
ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఉత్తమ రీతిలో ఉదూ చేస్తాడో అతని పాపాలు అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి, చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా బయటకు వెళ్ళిపోతాయి.”ముస్లిం నమోదు చేసినారు:
عن زيد بن خالد الجهني رضي الله عنه عن النبي صلى الله عليه وسلم أنه قال: «مَنْ فَطَّرَ صائمًا، كان له مِثْلُ أجْرِهِ، غَيْرَ أنَّهُ لاَ يُنْقَصُ مِنْ أجْرِ الصَّائِمِ شَيْءٌ».رواه الترمذي وابن ماجه والنسائي في الكبرى والدارمي وأحمد
సా’ద్ బిన్ అబీ వఖ్ఖాస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”ముస్లిం నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه مرفوعاً: «من مات ولم يَغْزُ، ولم يُحدث نفسه بالغزو، مات على شُعْبَةٍ من نِفَاقٍ»رواه مسلم
అదీ ఇబ్న్ హాతిం (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవ్వరితోనూ అల్లాహ్ మాట్లాడకుండా ఉండడు (మీలో ప్రతి ఒక్కరితో అల్లాహ్ మాట్లాడుతాడు); మరియు అతనికీ, అల్లాహ్ కు మధ్య అనువాదకుడు కూడా ఉండడు. అతడు తన కుడివైపు చూస్తాడు అక్కడ అతడు తాను ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు, మరియు అతడు తన ఎడమవైపు చూస్తాడు, అక్కడ అతడు ముందుకు పంపిన దానిని తప్ప (తన ఆచరణలను తప్ప) మరేమీ చూడడు. మరియు అతను తన ముందు వైపునకు చూస్తాడు; అతనికి ఎదురుగా నరకాగ్ని తప్ప మరేమీ కనిపించదు. కనుక నరకాగ్ని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి – అది ఖర్జూరములో సగభాగముతోనైనా సరే.అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు