Hadith for the World
ఆరాధనల ధర్మశాస్త్ర జ్ఞానం

తహారత్

18 hadiths

18 hadiths

అల్ ముగీరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక ప్రయాణములో నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ఉన్నాను. (వారు వుదూ చేస్తూ కాళ్ళు కడగడం దగ్గరికి వచ్చేసరికి) నేను, వారు కాళ్ళకు తొడుగుకుని ఉన్న, పలుచని తోలుతో చేసిన మేజోళ్ళను (ఖుఫ్ఫైన్ లను) తొలిగించడానికి ముందుకు వంగాను. అపుడు ఆయన ఇలా అన్నారు “వాటిని అలాగే ఉండనివ్వు (ఓ ముఘీరహ్), నేను వాటిని (పూర్తిగా) వుదూ చేసుకున్న తరువాత కాళ్ళకు తొడిగినాను”. అలా అని వారు తోలుతో చేసిన ఆ మేజోళ్ళపై తడి చేతులతో తడిమినారు (మసహ్ చేసినారు).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
హుదైఫా (రదియల్లాహు అన్హు) కధనం : “రాత్రిపూట ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్ర నుండి లేచినట్లయితే, వారు ‘సివాక్’ తో (పందోము పుల్లతో) పళ్ళను శుభ్రపరుచుకునేవారు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నాను: “మనిషి సహజత్వ ప్రక్రియలలో ఐదు విషయాలు ఇమిడి ఉన్నాయి: అవి సుంతీ, నాభి క్రింది భాగములోని వెంట్రుకలను తొలగించుట, మీసములను కత్తిరించుట (కురచగా చేయుట), (చేతి వేళ్ళ మరియు కాలి వేళ్ళ) గోళ్ళు కత్తిరించుట మరియు చంకలలోని వెంట్రుకలు తొలగించుట.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అనస్ ఇబ్న్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : కాలకృత్యములు తీర్చుకొనుటకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరుగుదొడ్డిలోనికి ప్రవేశించడానికి ముందు ఈ విధంగా పలికేవారు: “అల్లాహుమ్మ, ఇన్నీ అఊజుబిక మినల్ ఖుబుసి, వల్ ఖబాఇసి” (ఓ అల్లాహ్ దుష్టత్వానికి పాల్బడే ఆడ మరియు మగ శక్తులనుండి (ఆడ మరియు మగ షైతానుల నుండి) నీ రక్షణ కోరుతున్నాను).అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఒక ముస్లిం - లేదా విశ్వాసి - వుదూ చేసినప్పుడు — అతడు తన ముఖాన్ని కడిగినప్పుడు, అతడు తన కళ్లతో చూసిన ప్రతి పాపం, ఆ నీటితో లేదా చివరి నీటి బొట్టుతో ముఖం నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన చేతులను కడిగినప్పుడు, చేతులతో చేసిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో చేతుల నుండి బయటకు వచ్చేస్తుంది; అతడు తన కాళ్ళను కడిగినప్పుడు, కాళ్లతో వెళ్లిన ప్రతి పాపం, నీటితో లేదా చివరి నీటి బొట్టుతో కాళ్ళ నుండి బయటకు వచ్చేస్తుంది — అలా, చివరికి అతడు తన పాపాల నుండి పూర్తిగా శుభ్రంగా బయటకు వచ్చేస్తాడు."ముస్లిం నమోదు చేసినారు:
عن أبي هريرة رضي الله عنه مرفوعًا: «إِذَا لَبِسْتُم، وَإِذَا تَوَضَّأتُم، فَابْدَأُوا بَأَيَامِنُكُم».رواه أبو داود واللفظ له، والترمذي وابن ماجه وأحمد
عن أبي هريرة رضي الله عنه قال قال رسول الله صلى الله عليه وسلم : ((إن أمتي يُدْعَون يوم القيامة غُرًّا مُحَجَلِّين من آثار الوُضُوء)). فمن اسْتَطَاع منكم أن يُطِيل غُرَّتَه فَليَفعل. وفي لفظ لمسلم: ((رأَيت أبا هريرة يتوضَّأ، فغسل وجهه ويديه حتى كاد يبلغ المنكبين، ثم غسل رجليه حتى رَفَع إلى السَّاقين، ثم قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول: إنَّ أمتي يُدْعَون يوم القيامة غُرًّا مُحَجَّلِين من آثار الوُضُوء)) فمن استطاع منكم أن يطيل غُرَّتَه وتَحْجِيلَه فَليَفعَل. وفي لفظ لمسلم: سمعت خليلي صلى الله عليه وسلم يقول: ((تَبْلُغ الحِليَة من المؤمن حيث يبلغ الوُضُوء)).الرواية الأولى: متفق عليه. الرواية الثانية: رواها مسلم. الرواية الثالثة: رواها مسلم
అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా చిన్న హదస్ స్థితిలో (తప్పనిసరిగా వుదూ చేయవలసిన అశుద్ధ స్థితిలో) ఉన్నట్లయితే, వారు వుదూ చేయనంత వరకు అల్లాహ్ వారి సలాహ్ ను (నమాజును) స్వీకరించడు.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
షురైహ్ ఇబ్న్ హానీ ఉల్లేఖన: “నేను ఆయిషా (రదియల్లాహు అన్హా) ను ఇలా ప్రశ్నించాను “ఇంటిలోనికి ప్రవేశిస్తూనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఏమి చేసేవారు?” అని. దానికి ఆమె (ర) “వారు ముందుగా ‘సివాక్’ (పలుదోముపుల్ల) ఉపయోగించేవారు” అని సమాధానమిచ్చారు.”ముస్లిం నమోదు చేసినారు:
ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే ఉత్తమ రీతిలో ఉదూ చేస్తాడో అతని పాపాలు అతని శరీరం నుండి బయటకు వెళ్ళిపోతాయి, చివరికి అతని గోళ్ళ క్రింద నుండి కూడా బయటకు వెళ్ళిపోతాయి.”ముస్లిం నమోదు చేసినారు:
అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా ఒకవేళ నిద్ర నుంచి లేచినట్లయితే అతడు నీటితో ముక్కును మూడు సార్లు శుభ్రపరుచుకోవాలి, ఎందుకంటే షైతాను అతని ముక్కుపుటాలపై రాత్రి గడుపుతాడు కనుక.”అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
లఖీత్ ఇబ్న్ సబిరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: లఖీత్ ఇబ్న్ సబిరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “బనూ అల్ మున్తఫిఖ్ తెగవారు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చినపుడు నేను వారికి నాయకునిగానో లేదా వారిలో ఒకనిగానో ఉన్నాను. మేము చేరుకున్నపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటిలో లేరు. ఇంటిలో విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రదియల్లాహు అన్హా ఉన్నారు. ఆమె మా కోసం ‘ఖజీరా’ అనే వంటకం తయారు చేయాలని ఆదేశించినారు, ఆ వంటకం తయారైంది కూడా. తరువాత ఖర్జూరాలు ఉన్న ఒక పళ్ళెమును మా ముందు ఉంచడం జరిగింది. అప్పుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి వచ్చినారు, వచ్చి “మీకు ఏదైనా వడ్డించబడిందా లేదా మీ కోసం ఏదైనా తయారు చేయడానికి ఆదేశించడం జరిగిందా?” అని అడిగారు. మేము “అవును, ఓ రసూలుల్లాహ్! అలా ఆదేశించబడింది” అని జవాబిచ్చాము. మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంతో కలిసి కూర్చుని ఉన్నప్పుడు, అకస్మాత్తుగా ఒక గొర్రెల కాపరి గొర్రెలను తోలుకుంటూ వచ్చి వాటిని మందలో కలపడానికి తీసుకు వెళుతున్నట్లు చూశాము. అతని వెంట కొత్తగా పుట్టిన గొర్రెపిల్ల ఉన్నది, అది అరుస్తూ ఉన్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని “ఓ ఫలానా! అది (ఆ తల్లి గొర్రె) ఏమి ఈనింది?” అని అడిగారు. దానికి అతడు: “ఆడ గొర్రెపిల్ల” అని జవాబిచ్చాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అయితే ఆ గొర్రెపిల్లకు బదులుగా ఒక పెద్ద గొర్రెను వధించు” అన్నారు. తరువాత (మాతో) “పెద్ద గొర్రెను మీకోసం వధిస్తున్నామని అనుకోకండి. మా వద్ద వంద గొర్రెలున్నాయి. ఆ సంఖ్య పెరగడం మాకు ఇష్టం లేదు. ఆ సంఖ్యను నిలకడగా అలాగే ఉంచడానికి, కొత్తగా గొర్రెపిల్ల పుట్టినపుడల్లా ఒక పెద్ద గొర్రెను వధిస్తూ ఉంటాము” అన్నారు. తరువాత నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు ఒక భార్య ఉంది, ఆమె నాలుకలో ఏదో తప్పు ఉంది, అంటే ఆమె దుర్భాషలాడుతుంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అయితే ఆమెకు విడాకులు ఇవ్వు". నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము చాలా కాలంగా కలిసి ఉన్నాము, ఆమె ద్వారా నాకు పిల్లలు ఉన్నారు”. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "అయితే, ఆమెను ఆజ్ఞాపించు, ఆదేశించు" అంటే: ఆమెకు సలహా ఇవ్వు. "ఆమెలో మంచితనం ఉంటే, ఆమె కట్టుబడి ఉంటుంది. అయితే నీవు నీ బానిసను కొట్టినట్లు నీ భార్యను కొట్టకు." తరువాత నేను ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు ‘ఉదూ’ గురించి చెప్పండి. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఉదూను సమగ్రంగా, పరిపూర్ణంగా చేయి; ఒక్కొక్క వేలు మధ్య వేలుతో శుభ్రం చేయి, ముక్కు లోనికి నీరు బాగా ఎక్కించి నీటిని చీది వేయి, నీవు ఉపవాసపు స్థితిలో ఉంటే తప్ప”.అబూదావూద్, అత్తిర్మిదీ, అన్నసాయీ మరియు ఇబ్న్ మాజహ్ నమోదు చేసినారు:
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయతా ప్రమాణం చేసిన సాహబియ్యహ్ ఉమ్మ్ అతియ్య రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ఋతుస్రావం నుండి (బహిష్ఠు స్థితి నుండి) గుసుల్ చేసి పరిశుద్ధత పొందిన తరువాత (కూడా) విడుదల అవుతూ ఉండే పసుపు రంగు ద్రవాన్ని అపరిశుద్ధమైనదిగా (మలినంగా) లెక్క చేసే వారము కాదు.”అబూ దావూద్ పదాలతో మరియు అల్ బుఖారీ (తుహుర్ తరువాత) అనే పదం లేకుండా నమోదు చేసినారు:
عن حذيفة رضي الله عنه مرفوعًا: «فُضِّلْنَا على الناس بِثَلاث: جُعِلَت صُفُوفَنا كصفُوف الملائِكة، وجُعلت لنَا الأرض كُلُّها مسجدا، وجُعلت تُرْبَتُهَا لنا طَهُورا، إذا لم نَجِد الماء. وذَكر خِصْلَة أُخرى».رواه مسلم
عن سمرة رضي الله عنه مرفوعاً: «من توضَّأَ يوم الجُمعة فَبِهَا ونِعْمَتْ، ومن اغْتَسَل فهو أفْضَل».رواه أبو داود والترمذي والنسائي وابن ماجه والدارمي وأحمد
عن شريح بن هانئ، قال: أتيتُ عائشة أسألها عن المسح على الخُفَّين، فقالت: عَلَيْكَ بِابْنِ أبِي طالب، فَسَلْهُ فإِنَّه كان يُسَافِرُ مع رسول الله صلى الله عليه وسلم فسألناه فقال: «جَعَلَ رسول الله صلى الله عليه وسلم ثَلَاثَةَ أَيَّامٍ وَلَيَالِيَهُنَّ للمسافر، ويوما وليلة للمُقيم».رواه مسلم
అబీ మాలిక్ అష్’అరి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి, సలాహ్ (నమాజు) కాంతి, దానము చేయుట సాక్ష్యము, మరియు ‘సబ్ర్’ (సహనం) కాంతి. ఖుర్’ఆన్ నీ పక్షమున లేక నీకు వ్యతిరేకంగా సాక్ష్యము. ప్రజలు ప్రతి ఉదయం తమ ఇళ్ళనుండి బయలుదేరుతారు, తమ ఆత్మలను అమ్ముకుంటారు – మోక్షప్రాప్తి కొరకు లేక తమను తాము నాశనం చేసుకొనుట కొరకు”.ముస్లిం నమోదు చేసినారు:
عن سلمان الفارسي قال: قال النبي صلى الله عليه وسلم: «لا يغتسل رجلٌ يوم الجمعة، ويتطهر ما استطاع من طهر، ويدَّهنُ مِن دهنه، أو يمسُّ من طيب بيته، ثم يخرج فلا يفرِّق بين اثنين، ثم يصلي ما كُتب له، ثم ينصت إذا تكلم الإمام، إلا غُفر له ما بينه وبين الجمعة الأخرى».رواه البخاري