ఫిఖ్ మరియు దాని నియమాలు
అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఈద్ అల్ అద్’హా దినమునాడో లేదా ఈద్ అల్ ఫిత్ర్ దినమునాడో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం (ఈద్) నమాజు ఆచరించుటకు నమాజు ఆచరించు ప్రదేశానికి బయలుదేరినారు. దారిలో వారు ఒక స్త్రీల గుంపును దాటుకుంటూ వెళ్ళినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా పలికినారు:
Available in 51 languages
«అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఈద్ అల్ అద్’హా దినమునాడో లేదా ఈద్ అల్ ఫిత్ర్ దినమునాడో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం (ఈద్) నమాజు ఆచరించుటకు నమాజు ఆచరించు ప్రదేశానికి బయలుదేరినారు. దారిలో వారు ఒక స్త్రీల గుంపును దాటుకుంటూ వెళ్ళినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా పలికినారు: “ఓ స్త్రీలారా! మీరు ఎక్కువగా దానధర్మాలు చేయండి, ఎందుకంటే నరకాగ్నివాసులలో ఎక్కువమంది స్త్రీలే ఉండడాన్ని నేను చూసాను”. దానికి వారు “అలా ఎందుకు ఓ రసూలుల్లాహ్?” అని ప్రశ్నించినారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీరు తరుచూ శాపనార్థాలు పెడతారు, మీ భర్తలపట్ల మీరు కృతజ్ఞులుగా ఉండరు; వివేకములో మరియు ధర్మములో మీకంటే ఎక్కువ కొరత కలిగిన వారిని నేను చూడలేదు, మరియు అత్యంత జాగ్రత్తగా ఉండే వివేకవంతుడైన పురుషుడుని సైతం మీలో కొందరు తప్పుదారి పట్టించగలరు”. దానికి వారు “మా ధర్మములో మరియు వివేకములో ఉన్న లోపం ఏమిటి?” అని ప్రశ్నించినారు. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగినారు: “(షరియత్’లో) ఒక స్త్రీ సాక్ష్యము, పురుషుని సగం సాక్ష్యానికి సమానం కాదా? (అంటే ఇద్దరు స్త్రీల సాక్ష్యము ఒక పురుషుని సాక్ష్యమునకు సమానము కాదా?”) దానికి వారు “అవును” అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇది వివేకములో ఆమె లోపము. అలాగే స్త్రీ బహిష్ఠు స్థితిలో ఉన్నపుడు ఆమె నమాజు ఆచరించదు, ఉపవాసము పాటించదు, అవును కదా?” అని ప్రశ్నించారు. దానికి వారు “అవును” అని సమాధానం ఇచ్చినారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “ఇది ధర్మములో ఆమె కొరత” అన్నారు.”»Meaning translation ·
Saved at original quality








