Hadith for the World
Tap the image to view it full size
అల్ అఖీద

అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ రజియల్లాహు అన్హుమా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు:

Available in 60 languages
«అబ్దుల్లాహ్ ఇబ్నె అమ్ర్ రజియల్లాహు అన్హుమా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ముస్లిం ఎవరంటే – ఎవరి నాలుక నుండి మరియు చేతి నుండి తోటి ముస్లిములు సురక్షితంగా ఉంటారో; మరియు ‘ముహాజిరు’ (అల్లాహ్ మార్గములో మరో ప్రదేశానికి వలస వెళ్ళిన వ్యక్తి) ఎవరంటే – ఎవరైతే అల్లాహ్ నిషేధించిన వాటిని వదలివేస్తాడో.”»

Meaning translation ·

Explanation

The meaning in a few plain lines

సహచర ముస్లింలు ఎవరి నాలుక నుండి అయితే సురక్షితంగా ఉంటారో, అతడే నిజమైన మరియు పరిపూర్ణమైన ముస్లిం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో తెలియజేస్తున్నారు. అతను వారిని అవమానించడు, తిట్టడు లేదా వెన్నుపోటు పొడవడు మరియు తన నాలుకతో వారిని బాధించడు. అలాగే సహచర ముస్లిములు అతని చేతి నుండి కూడా సురక్షితంగా ఉంటారు – అంటే అతడు వారిపై దాడి చేయడు, వారి సంపదలను అన్యాయంగా, అధర్మంగా కబళించడు; లేక ఆవిధమైన ఏ పనీ చేయడు. అలాగే ‘ముహాజిరు’ అంటే అల్లాహ్ నిషేధించిన వాటన్నింటినీ వదలివేసే వాడు.

Source
అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
Download image

Saved at original quality